
కొల్లేటికోటలో విద్యుత్ ధగధగలు
కై కలూరు: రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా దేవస్థాన పరిసరాలు విద్యుత్ దీపాలంకరణలతో కాంతులీనుతున్నాయి. ఈ నెల 22 నుంచి అక్టోబరు 2 వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు చెప్పారు. ఈ నెల 22న శ్రీచక్రార్చన, 23న దేవి ఖడ్గనామ పూజ, 24న ఆవరణపూజ, 25న అష్టోత్తర కలశపూజ, పంచామృతాభిషేకం, పంచగవ్య ప్రాశన, ఖడ్గ నామావళి కుంకుమ పూజ, 26న గులాబీ పుష్పార్చన, 27న చామంతి పూజ, 28న నవ కలశపూజ, 29న పంచామృత, పంచఫల అభిషేకం, 30న సుగంధ పరిమళ ద్రవ్యార్ధన, అక్టోబరు 1న నవమ నవావరణార్ధన, 2న శ్రీలలితా త్రిశథి, సహస్రనామ ఖడ్గమాల పూజ జరుగుతాయని, దీంతోపాటు నిత్యం లలిత సహస్రనామ కుంకుమ పూజ ఉంటుందని, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.

కొల్లేటికోటలో విద్యుత్ ధగధగలు