
నవరాత్రి కాంతులు
ద్వారకాతిరుమల: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయానికి ఉపాలయమై, క్షేత్ర దేవతగా విరాజిల్లుతోన్న శ్రీ కుంకుళ్లమ్మ అమ్మవారి ఆలయం విద్యుద్దీప అలంకారాలతో కనువిందు చేస్తోంది. ఆలయ ప్రధాన రాజగోపురం, పరిసరాలు కాంతులీనుతున్నాయి. రహదారికి ఇరువైపులా ఏర్పాటు చేసిన విద్యుత్ తోరణాలు, అమ్మవారి భారీ విద్యుత్ కటౌట్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇదిలా ఉంటే గ్రామంలోని చిలుకూరి మహిళలు ప్రతి ఏటా వలె ఉత్సవాల ప్రారంభం ముందురోజు అయిన ఆదివారం రాత్రి కుంకుళ్లమ్మకు పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలు, పూలు, పండ్లను సమర్పించారు.

నవరాత్రి కాంతులు