
చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
నరసాపురం రూరల్: ఒంటరిగా ఇంట్లో ఉన్న మహిళపై దాడి చేసి ఆమె మెడలో బంగారం అపహరించిన నిందితుడిని ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నరసాపురం సీఐ దుర్గాప్రసాద్ వెల్లడించారు. మొగల్తూరు మండలం కాళీపట్నం తూర్పు గ్రామానికి చెందిన బళ్ళ సూర్య ఆదిలక్ష్మి (55) 30 ఏళ్లుగా భర్తను వీడి ఒంటరిగానే జీవిస్తోంది. కొద్దిపాటి మొత్తాలను వడ్డీలకు ఇస్తూ జీవనం సాగిస్తోంది. గ్రామానికి చెందిన మారోజు శ్రీనివాస్ ఆదిలక్ష్మి వద్ద గతంలో రూ.10 వేలు అప్పు తీసుకున్నాడు. ఈ క్రమంలో శనివారం తన ఇంటిలో ఉన్న కలపను విక్రయించేందుకు ఆదిలక్ష్మి శ్రీనివాస్‌కు చూపిస్తు ఉండగా అతడు అమైపె కరత్రో దాడి చేసి ఆమె మెడలోని బంగారు బొందు, చెవి దిద్దులు లాక్కొని ఇంటి వెనుక భాగం నుంచి పరారయ్యాడు. చుట్టుపక్కలవారు గాయపడిన ఆదిలక్ష్మిని ఆసుపత్రికి తరలించగా బాధితురాలి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆదివారం ఉదయం కాళీపట్నం చేపల చెరువు వద్ద నిందితుడు శ్రీనివాస్‌ను ఆరెస్ట్ చేసి, చోరీ సొత్తు రికవరీ చేశామని, నిందితుడిని కోర్టుకు హాజరుపర్చగా రిమాండ్ విధించినట్టు సీఐ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సై జి.వాసు, స్టేషన్ సిబ్బంది ఉన్నారు.