
టెక్‌జైట్–25 పోస్టర్ ఆవిష్కరణ
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీలో డిసెంబర్ 18 నుంచి 20 వరకు నిర్వహించనున్న టెక్‌జైట్–25 కార్యక్రమం పోస్టర్‌ను శనివారం డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ ఈ టెక్‌జైట్‌ను ఈ సారి క్వాంటం టెక్నాలజీస్–షేపింగ్ ద ఫ్యూచర్, వన్ క్యాంటమ్ లీప్ ఎట్ ఏ టైమ్ అనే థీమ్‌తో నిర్వహిస్తున్నామన్నారు. ఈ టెక్‌జైట్‌లో టెక్నికల్ ఈవెంట్స్, ఇన్నోవేషన్ ఎగ్జిబిషన్, రోబోటిక్స్ పోటీలు, పేపర్ ప్రజెంటేషన్‌లు, హాక్‌థాన్ పోటీలు, మేనేజ్‌మెంట్ కార్యకలాపాలతో పాటు సాంస్కృతిక సంబరాలను నిర్వహిస్తారన్నారు. టెక్నాలజీ, మేనేజ్‌మెంట్, ఇన్నోవేషన్, క్రియేటివిటీని ప్రోత్సహిస్తూ విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు ఈ టెక్‌జైట్ వేదికగా నిలుస్తుందన్నారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సెంట్రల్ డీన్ దువ్వూరి శ్రావణి, ఏఓ లక్ష్మణరావు, డీన్ సాదు చిరంజీవి, డీఎస్‌డబ్ల్యుఓ లు రాజేష్, దుర్గాభవాని, హెచ్‌ఓడీలు పాల్గొన్నారు.