
శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ
ద్వారకాతిరుమల: శ్రీవారికి ప్రీతికరమైనరోజు కావడంతో శనివారం అధిక సంఖ్యలో భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించారు. మద్యాహ్నం నుంచి అమావాస్య మొదలవడంతో ప్రతి వారం కంటే ఈ వారం తక్కువ మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం క్యూలైన్లు మధ్యాహ్నం వరకు భక్తులతో నిండుగా కనిపించాయి. ఆ తరువాత దర్శనం క్యూలైన్లలో, అలాగే అనివేటి మండపం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, కల్యాణకట్ట తదితర విభాగాల్లో సాధారణ భక్తుల రద్దీ కనిపించింది. నెల్లూరు జిల్లా, కందుకూరు మండలం, కమ్మవారిపాలెంకు చెందిన శ్రీ సరస్వతి కోలాట బృంద సభ్యులు 30 మంది ఉదయం అనివేటి మండపంలో ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి.