
చింతలపూడి కూటమిలో కొట్లాట
న్యూస్‌రీల్
ఎమ్మెల్యే తీరుపై ఫిర్యాదు
చింతలపూడి కూటమిలో కొట్లాటలు, కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. మిగిలిన నియోజకవర్గాల్లో మాదిరిగా జనసేన వర్సెస్ టీడీపీ కాకుండా టీడీపీ వర్సెస్ టీడీపీ, జనసేన వర్సెస్ జనసేనలాగా రగడ సాగుతోంది. ఎమ్మెల్యే సొంగా రోషన్ వ్యవహారంపై టీడీపీ నేతలు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేయగా, జనసేన ఇన్‌చార్జి తీరుపై ఆ పార్టీ నేతలు సోషల్ మీడియా వేదికగా బహిరంగంగా ఆరోపణలు గుప్పించడంతోపాటు డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌కు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది.
ఆదివారం శ్రీ 21 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
సాక్షిప్రతినిధి, ఏలూరు: చింతలపూడి కూటమిలో జరుగుతున్న పరిణామాల క్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ పదవిని సీనియర్లకు కాకుండా జనసేనలో కొత్తగా చేరిన వారికి కట్టపెట్టడం, దాని వెనుక నగదు లావాదేవీలు జరిగాయన్న ఆరోపణలతో నియోజకవర్గ రాజకీయం మలుపు తిరుగుతోంది.
మెట్ట రాజకీయాల్లో కీలకంగా..
మెట్ట ప్రాంత రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలి చే చింతలపూడి కూటమి వ్యవహారం రోజుకో మ లుపు తిరుగుతోంది. నిన్నమొన్నటి వరకూ సహకార సొసైటీ పదవుల పంపకాల విషయంలో జనసేన, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం, జన సేన ఇన్‌చార్జి ఏకంగా టీడీపీ ఎమ్మెల్యేను, ము ఖ్యులను పరోక్షంగా విమర్శిస్తూ సోషల్ మీడియా పో స్టులతో హడావుడి చేశారు. పలు సమీకరణాలు, అంతర్గత వ్యవహారాలతో చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్, జనసేన ఇన్‌చార్జి మేకా ఈశ్వరయ్య సర్దుబాటు చేసుకున్నారు.
ఏఎంసీ పదవి చిచ్చు : తాజాగా మార్కెట్ యార్డు పదవి రెండు పార్టీల ముఖ్యుల మధ్య కాకుండా నేతల మధ్య చిచ్చురేపింది. నియోజకవర్గంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డు చైర్మన్ పదవికి మంచి డిమాండ్ ఉంది. ఏటా సుమారు రూ.9 కోట్ల నుంచి రూ.10 కోట్ల వార్షిక ఆదాయం ఉన్న మార్కెట్ యార్డు కావడం, నియోజకవర్గ స్థాయి పదవి తరహాలో ఉండటంతో జనసేన, టీడీపీ నుంచి విపరీతంగా నేతలు పదవి కోసం క్యూ కట్టి పలు రకాల లాబీయింగ్‌లు నిర్వహించారు. టీడీపీ నుంచి నందిగం తిలక్, సూరానేని గోపి అలాగే జనసేన నుంచి తూము నాగ విజయ్‌కుమార్, చీదరాల మధుబాబు ఈ పదవిని ఆశించారు. దాదాపుగా 7 నెలలకుపైగా నియామకానికి సంబంధించి తర్జనభర్జనలు, చర్చలు కొనసాగాయి. ఈ క్రమంలో ఏలూరు ఎంపీ కోటాలో తనకు ఖరారు అవుతుందని నందిగం తిలక్ భావించారు. అలాగే జనసేన కోటాలో తనకు అవకాశం వస్తుందని తూము వి జయకుమార్ ఆశించారు. ప్రజారాజ్యం పార్టీ ఆ విర్భావం నుంచి క్రియాశీలక రాజకీయాల్లో ఉంటూ చిరంజీవి రక్తదానం, నేత్రదానం శిబిరాలు నిర్వహిస్తూ జనసేనలో కీలకంగా పనిచేస్తూ జిల్లా సహా య కార్యదర్శిగా ఉన్న తనకు అవకాశం ఇస్తామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చారని బలంగా నమ్మడంతో పాటు విజయ్‌కుమార్ అందరికీ చెప్పుకున్నారు. కట్ చేస్తే.. అనూహ్యంగా కొంత కాలం క్రితమే జన సేనలో చేరిన చిదరాల మధుబాబు సతీమణి దుర్గాపార్వతిని ఎంపిక చేశారు. నియామకం వెనుక ఎమ్మెల్యే, జనసేన ఇన్‌చార్జితో పాటు మంత్రి నా దెండ్ల మనోహర్ బలంగా పనిచేశారనేది టాక్. దీంతో విజయ్‌కుమార్ ఇన్‌చార్జి ఈశ్వరయ్య తీరుపై మండిపడుతూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీ డియో వైరల్‌గా మారింది. జన సైనికులను సోషల్ మీడియా పోస్టుల పేరిట ఇన్‌చార్జి అనుచరులు వేధి స్తారని, అలాగే నియామకం వెనుక నగదు లావాదేవీలున్నాయని ఆరోపించడం సంచలనంగా మారింది. నామినేటెడ్ పదవి పొందిన నేత భర్తపైన చీటింగ్ కేసు కూడా ఉందంటూ ఆరోపణలు గుప్పించడంతో జనసేన వర్సెస్ జనసేనగా రగడ సాగుతోంది.
ఎమ్మెల్యే సొంగా రోషన్ మండలానికొక ముఖ్యనేతకు పెత్తనం అప్పజెప్పి పార్టీలో సీనియర్లను, మొదటి నుంచి పనిచేస్తున్న వారిని విస్మరించి ఏకపక్షంగా సాగుతుండటం చర్చనీయాంశంగా మారింది. దీంతో ప్రతి మండలంలోనూ ఎమ్మె ల్యే వ్యతిరేక గ్రూపులు బలంగా కొనసాగుతున్నాయి. కామవరపుకోటకు చెందిన కొందరు నేతలు నేరుగా సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చే శారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కొద్దిరోజులు క్రి తం సమావేశం నిర్వహించి తనపై ఎవరు ఫిర్యా దు చేసినా అధిష్టానం పట్టించుకోదని.. తాను, ఎంపీ కలిసే ఉన్నామని తమ ఇద్దరి మీద ఎవరు ఏంచెప్పినా ఉపయోగం లేదంటూ వ్యాఖ్యలు చేయడం టీడీపీలో మరో చర్చకు దారి తీసింది.
సొంత పార్టీల్లోనే భగ్గుమంటున్న అసంతృప్తి
ఎమ్మెల్యే తీరుపై అధిష్టానానికి టీడీపీ నేతల ఫిర్యాదు
జనసేనలో ఇన్‌చార్జి తీరుపైనా మండిపాటు
ఏఎంసీ చైర్మన్ పదవి అమ్ముకున్నారంటూ జనసేన నేత ఆరోపణలు
గందరగోళంలో చింతలపూడి కూటమి రాజకీయం