
ఇసుకపై అధనపు దోపిడీ
వేధింపులు ఆపాలి
సాక్షి, భీమవరం: జిల్లాలోని స్టాక్ పాయింట్లలో ఇసుక ధరలు వినియోగదారులకు భారమవుతున్నాయి. ఇక్కడ లోడింగ్ అయ్యే ఖర్చుకంటే తక్కువకే బయటి నుంచి ఇసుక వచ్చేస్తోంది. దీంతో బయటి ప్రాంతాల నుంచి ఇసుక రాకుండా నిర్వాహకులు అడ్డుకుంటున్నారని, అందుకు అధికారులు సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
వేల టన్నుల్లో ఇసుక నిల్వలు
గోదావరి వరదల సమయంలో ఇసుక కొరత రాకుండా స్టాక్ పాయింట్లు ఏర్పాటుకు ఏప్రిల్‌లో జిల్లా శాండ్ కమిటీ నిర్ణయించింది. నియోజకవర్గానికి ఒకటి చొప్పున స్టాక్ పాయింట్ నిర్వహణ బాధ్యతల్ని ఏజెన్సీలకు అప్పగించారు. జిల్లాకు ప్రత్యేకంగా కేటాయించిన తూర్పుగోదావరి జిల్లా పెండ్యాల ఓపెన్ రీచ్ నుంచి 5 లక్షల టన్నుల ఇసుకను నిల్వ చేయాలన్నది లక్ష్యం. కాగా 1.20 లక్షల టన్నులు స్టాకు పెట్టినట్టు సమాచారం. ఆచంట స్టాక్ పాయింట్‌లో 20,100 టన్నులు పెట్టగా, భీమవరంలో 6,240, నరసాపురంలో 2,450, పాలకొల్లులో 19,555, తాడేపల్లిగూడెంలో 35,180, తణుకులో 7,878, ఉండిలో 28,990 టన్నులు నిల్వ చేశారు.
దూరాన్ని బట్టి ధర..
ఇసుక ర్యాంపు నుంచి ఆయా స్టాక్ పాయింట్లకు ఉన్న దూరాన్ని బట్టి ఒక్కో టన్నుకు రూ.306 నుంచి రూ. 581 ధరగా నిర్ణయించారు. ఆచంట స్టాక్ పాయింట్‌లో టన్నుకు రూ.444, భీమవరం, నరసాపురంలలో రూ. 581, పాలకొల్లులో రూ.556, తాడేపల్లిగూడెంలో రూ.456, తణుకులో రూ.306, ఉండిలో రూ.550 ధరలుగా నిర్ణయించారు. వీటికి లోడింగ్, జీఎస్టీ చార్జీలు అదనంగా వసూలు చేస్తున్నట్టు లారీ యజమానులు చెబుతున్నారు. కూటమి నేతల పర్యవేక్షణలోనే స్టాక్ పాయింట్లు నడుస్తున్నాయి.
బయటి ప్రాంతం నుంచి లోడ్ తీసుకురావద్దని, లోకల్‌గా ఉన్న యార్డులోనే ఇసుకను తీసుకువెళ్లాలని తాడేపల్లిగూడెంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తనిఖీల పేరిట అధికారులు వారికి వత్తాసు పలకడం సరికాదు. తక్కువ ధరకు వినియోగదారులకు ఇసుకను ఇచ్చే ఏర్పాటు చేయాలి. కిరాయిలు లేక లారీ యజమానులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వేధింపులపై చర్యలు తీసుకోవాలని జిల్లా అసోసియేషన్ తరఫున కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం.
– రావూరి రాజా, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
కూటమి ఇసుకాసురులు
జిల్లాలోని స్టాక్ పాయింట్లలో భారీగా ధరలు
పక్క జిల్లాలో తక్కువ ధరకే ఇసుక లభ్యం
వినియోగదారులపై లారీకి రూ.5 వేల వరకు భారం
బయటి నుంచి తీసుకురాకుండా అడ్డుకుంటున్న స్టాక్ పాయింట్ నిర్వాహకులు
కలెక్టర్‌కు ఉమ్మడి జిల్లా టిప్పర్ లారీ అసోసియేషన్ ఫిర్యాదు
‘జిల్లా కలెక్టర్ వారికి.. తాడేపల్లిగూడెం వెళ్లే ఇసుక లారీలు బయట ప్రాంతాల నుంచి లోడ్ తీసుకురావద్దని, లోకల్‌గా ఉన్న ఇసుక స్టాక్ యార్డ్ నుంచే తోలుకోవాలని ఇబ్బంది పెడుతున్నారు. వీరికి పోలీసు, రెవెన్యూ వారు సహకరిస్తున్నారు. పరిశీలించి చర్యలు తీసుకోగలరు’
– ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా టిప్పర్ లారీ అసోసియేషన్

ఇసుకపై అధనపు దోపిడీ