
కలెక్టర్ వెట్రిసెల్వి
బంగారు ఆభరణాల అపహరణ
ఒంటరిగా ఇంట్లో ఉన్న మహిళపై కర్రతో దాడి చేసి ఆమె ఒంటిపై బంగారు ఆభరణాలను దుండగుడు అపహరించుకు పోయాడు. 10లో u
సాగులో యాంత్రీకరణతో రైతులకు మేలు
లింగపాలెం: సాగులో యాంత్రీకరణ, డ్రోన్ వినియోగంతో రైతులకు మేలు జరుగుతుందని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. లింగపాలెం–కళ్యాణపాడు వరి పొలాలకు డ్రోన్‌ల ద్వారా నానో యూరియా పిచికారీ చేస్తున్న కార్యక్రమాన్ని కలెక్టర్ శనివారం పరిశీలించారు. వ్యవసాయాన్ని సులభతరం చేసేందుకు ప్రభుత్వం సబ్సిడీపై అధునాతన వ్యవసాయ పరికరాలు అందిస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సర్వాంధ్ర–స్వచ్ఛాంధ్రలో..
స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రలో భాగంగా అంగన్‌వాడీ సెంటర్, జెడ్పీ హైస్కూల్, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం, కిచెన్ గార్డెన్స్‌ల వద్ద కార్యక్రమాల్లో కలెక్టర్ పాల్గొని మొక్కలు నాటారు. కాఫీ విత్ క్లాప్ మిత్ర కార్యక్రమం ద్వారా ఐదుగురు శానిటేషన్ సిబ్బందికి సన్మానాలు చేశారు. ఐదుగురు రైతులకు కంపోస్టు ఎరువుల ప్యాకెట్లు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యా వరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రతినెలా ఒక థీమ్‌తో స్వచ్ఛాంధ్ర కార్య క్రమం నిర్వహిస్తున్నామని, గ్రీన్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యమన్నారు. ప్రజలు విరివిగా వినియోగిస్తున్న ప్లాస్టిక్‌ను దశలవారీగా నిషేధిస్తున్నామని, ఇందుకు అందరూ సహకరించాలని కోరారు. ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు. సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి షేక్ హబీబ్ బాషా, డీపీఓ కె.అనురాధ, డీఎల్‌డీఓ పి.వెంకటరత్నం, తహసీల్దార్ ఎండీ నజీముల్లాషా, ఎంపీడీఓ కె.వాణి తదితరులు ఉన్నారు.