
విద్యుత్ ఉద్యోగుల దీక్షలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలో విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న 35 వేల మంది పర్మినెంట్, 26 వేల మంది కాంట్రాక్టు కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని పీడీసీఎల్ ఐదు జిల్లాల డిస్కం జేఏసీ కన్వీనర్ భూక్యా నాగేశ్వర రావు డిమాండ్ చేశారు. ఏపీ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక విద్యుత్ భవన్ వద్ద ఉద్యోగులు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఐదు రోజులుగా దశలవారీగా ఆందోళనలు నిర్వహిస్తున్నా విద్యుత్ యా జమాన్యాలు స్పందించకపోవడం దారుణమన్నారు. జిల్లా జేఏసీ చైర్మన్ ఎం.రమేష్, జిల్లా కన్వీనర్ వి.రాము మాట్లాడుతూ ఈనెల 22న చేపట్టనున్న శాంతి ర్యాలీని జయప్రదం చేయా లని పిలుపునిచ్చారు. డిస్కం కో–కన్వీనర్ తు రగా రామకృష్ణ, ఉద్యోగ సంఘాల నాయకులు ఎస్.అబ్బాస్, ఎ.సంజయ్, కె.గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు (టూటౌన్): బాలలను విద్యావంతులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఉమ్మడి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ అన్నారు. శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ–బాలల కోసం స్నేహపూర్వక న్యాయ సేవలు పథకం, 2024 అంశంపై ఉమ్మడి జిల్లాలోని మండల స్థాయి విద్యాశాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, ప్యానల్ న్యాయవాదులతో ఆయన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలల సమగ్రాభివృద్ధికి కృషిచేయాలన్నారు. చట్టంతో విభేదించిన బాలలకు ఉచిత న్యాయ సహాయ అందించడం, పునరావాసం కల్పించడానికి జిల్లా న్యాయ సేవధికార సంస్థ కృషి చేస్తోందన్నారు. డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ, విభిన్న ప్రతిభావంతుల శాఖ అదనపు డైరెక్టర్ రామ్‌కుమార్, శిశు సంరక్షణ అధికారులు సీహెచ్ సూర్యచక్రవేణి, ఆర్.రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు(మెటో): ఏలూరు రెవెన్యూ డివిజన్‌లో తాత్కాలికంగా దీపావళి బాణసంచా దుకాణాల ఏర్పాటుకు వచ్చేనెల 12లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుతో పాటు దరఖాస్తుదారుని ఆధార్ కార్డు, పాన్ కార్డు, చలానా ఒరిజినల్, జీఎస్టీ రశీదు జతచేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు అనుసరించి లైసెన్సులు మంజూరు చేస్తామన్నారు.
పాలకోడేరు: పాలకోడేరు మండలం కొండేపూడి గ్రామంలో శ్శశానానికి వెళ్లేందుకు జీ అండ్ వీ కెనాల్ దాటాలి, లేదా రెండు కిలోమీటర్లు చుట్టు తిరిగి వెళ్లాలి. ఈ కాలువపై వంతెన నిర్మిస్తామని ఎన్నికల సమయంలో నాయకులు హామీలు ఇవ్వడం, అధికారం చేపట్టిన తర్వాత పట్టించుకోకపోవడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో గ్రామంలో ఎవరైనా కన్నుమూస్తే మృతదేహంతో కాలువ దాటడం గ్రామస్తులకు కష్టంగా మారింది. మృతదేహాన్ని పడవల మీద తీసుకువెళ్లాల్సి వస్తోంది. ఆ సమయంలో కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటే ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రస్తుత మండల పరిషత్ అధ్యక్షుడు భూపతిరాజు చంటి రాజు కొండేపూడి నుంచి ఎంపీటీసీగా గెలుపొంది ఎంపీపీ పీఠాన్ని అధిరోహించారు. ఆ యన కూడా ఇక్కడ వంతెన నిర్మిస్తానని హామీ ఇచ్చారు. పదవీకాలం పూర్తవుతున్నా ఇప్పటికీ వంతెన నిర్మాణం కార్యరూపం దాల్చలేదు. శుక్రవారం గ్రామానికి చెందిన పట్టెం సత్యానందం (45) అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందగా మృతదేహాన్ని ఖననం చేసేందుకు కు టుంబసభ్యులు జీ అండ్ వీ కెనాల్‌పై పడవపై ప్రమాదకరంగా తీసుకువెళ్లారు.