
అడుగడుగునా పోలీసు ఆంక్షలు
ప్రభుత్వ కాలేజీల ప్రైవేటీకరణపై కొద్ది రోజులుగా వైఎస్సార్‌సీపీ పలు కార్యక్రమాలు చేస్తుండటం, ఏలూరులో మెడికల్ కాలేజీ మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనే వచ్చిందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతుండటంతో కూటమి నేతల్లో భయం పట్టుకుంది. దీంతో చలో మెడికల్ కాలేజీ కార్యక్రమం విజయవంతం అయితే ప్రజలు ఛీకొడతారనే ఉద్దేశంతో అడ్డుకునే కుట్రలు చేశారు. పోలీస్ అధికారుల అండదండలతో ఈ కార్యక్రమానికి ఆంక్షలు విధించారు. పాతబస్టాండ్ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు మెడికల్ కాలేజీ, డీఎంహెచ్‌వో కార్యాలయ ప్రాంగణంలోకి వెళ్లేందుకు ఎవరినీ అనుమతించలేదు. బారికేడ్లు పెట్టడంతోపాటు భారీఎత్తున పోలీస్ అధికారులు, సిబ్బంది, ఏఆర్ పోలీసులను మోహరించారు. ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్ పర్యవేక్షణలో ఏలూరు టూటౌన్ సీఐ అశోక్‌కుమార్, వన్‌టౌన్ ఇన్‌చార్జి సీఐ సుబ్బారావు, సీఐ వెంకటేశ్వరరావు, పెదవేగి సీఐ సీహెచ్ రాజశేఖర్, ట్రాఫిక్ సీఐ లక్ష్మణరావు, 20 మంది ఎస్సైలు, పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.
మెడికల్ కళాశాలకు వెళ్లకుండా పోలీసు జీపు అడ్డుపెట్టిన దృశ్యం
వైఎస్సార్‌సీపీ శ్రేణులను అడ్డుకుంటున్న పోలీసులు

అడుగడుగునా పోలీసు ఆంక్షలు