
ఎన్నికల హామీలను అమలు చేయాలి
చింతలపూడి: కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల వృత్తిపరమైన, ఆర్థికపరమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్ చేపట్టిన రణభేరి యాత్ర శుక్రవారం చింతలపూడి మండలానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 15 నెలల పరిపాలనలో ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. పీఆర్సీ కమిషన్ నియమిస్తామని, పెండింగ్‌లో ఉన్న డీఏలు చెల్లిస్తామని, ఉపాధ్యాయులకు మరింత గౌ రవం పెంచుతామని చంద్రబాబు వాగ్దానాలు చేసి మోసగించారన్నారు. ఐఆర్ ప్రకటించాలని, యాప్‌ల భారం తగ్గించాలని జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ డిమాండ్ చేశారు. యూటీఎఫ్ జిల్లా నాయకులు పూరేటి శ్రీనివాసరావు, అప్పారావు, దామోదర్, ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు.
25న భారీ బహిరంగ సభ