
తల్లి కథ సుఖాంతం
కొయ్యలగూడెం: పొంగుటూరులో తల్లి కథ సుఖాంతం అయ్యింది. ‘సాక్షి’లో శుక్రవారం ‘కన్న బిడ్డలకు భారం కాలేక ఆత్మహత్యాయత్నం’ శీర్షికన ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. తహసీల్దార్ ఎన్.నాగరాజు పొంగుటూరు గ్రామానికి వెళ్లి వృద్ధురాలు మద్దాల రంగమ్మ విషయంపై ఆరా తీశారు. ఆమెతో మాట్లాడి అనంతరం సర్పంచ్ పసుపులేటి రాంబాబుతో కలిసి వృద్ధురాలిని ఆమె కుమారుడు శేషారావుకు అప్పగించి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ రంగమ్మకు కొంత మతిస్థిమితం లేకపోవడంతో ఆమె ఇబ్బందులు ఎదురోవాల్సి వచ్చిందని ఈ నేపథ్యంలో ఆమె కొడుకు, కోడలికి రంగమ్మ విషయంలో జాగ్రత్తలు తీసుకోమని చెప్పామన్నారు. అలాగే రంగమ్మకు సంబంధించి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యారోగ్య సిబ్బందికి సూచించామన్నారు.

తల్లి కథ సుఖాంతం