
ఆధార్ సీడింగ్ వేగిరపర్చాలి
ఏలూరు(మెట్రో): పిల్లల ఆధార్ సీడింగ్, బయోమెట్రిక్ అప్‌డేషన్ ప్రక్రియ వేగిరపర్చాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో మండలాల వారీగా ఆధార్ మానిటరింగ్ ప్రగతిని సమీక్షించారు. జిల్లాలో 192 ఆధారు సెంటర్లు ఉన్నాయని, అన్ని మండలాల్లో ఆధారు సెంటర్లు, ఆధారు కిట్లు సమర్థవంతంగా పనిచేసేలా చూసి లక్ష్యాలను అధిగమించాలని కలెక్టర్ ఆదేశించారు. ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఆధార్ రీజనల్ మేనేజర్ ఎ.సత్యకళ, జెడ్పీ సీఈఓ ఎం.శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
ఆక్వా రైతుల మొర : మత్స్య, విద్యుత్ శాఖ అధి కారులు, కై కలూరు, ఉంగుటూరు, ఏలూరు, నిడమర్రు తదితర మండలాలు ఆక్వా, చేపలు చె రువులు రైతులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఆక్వా రైతులు తమ సమస్యలను కలెక్టర్‌కు విన్నవించారు. విద్యుత్ సమస్య, చెరువులకు అప్రోచ్ రోడ్ల నిర్మాణాలు, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు సబ్సిడీ, మోటార్ బోట్లు, టార్పాలిన్లు, ఆక్వా పరికరాలు, మేతకు సబ్సిడీలు, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు సబ్సిడీలు తదితర విషయాలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతుల సమస్యలు ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు.