
పత్రికలపై కేసులు అన్యాయం
ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించే పత్రికలపై కేసులు పెట్టడం అన్యాయం. పత్రికా స్వేచ్ఛను హరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎడిటర్ స్థాయి వ్యక్తులపై ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాశారని కేసులు పెట్టడం గతంలో ఎన్నడూ చూడలేదు. ప్రభుత్వ విధానాలు పత్రికా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టులా ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా ఉన్న పత్రికలను గౌరవించాలి. ప్రభుత్వ విధానాలను ప్రతిఒక్కరూ ఖండించాలి.
– గుంటి ప్రభు, న్యాయవాది, అంబేడ్కర్ యూత్ ఫోర్స్, రాష్ట్ర అఽధ్యక్షుడు, భీమవరం