పంట కాలువలోకి దూసుకెళ్లిన స్కూల్‌ బస్సు | - | Sakshi
Sakshi News home page

పంట కాలువలోకి దూసుకెళ్లిన స్కూల్‌ బస్సు

Sep 19 2025 2:03 AM | Updated on Sep 19 2025 2:03 AM

పంట క

పంట కాలువలోకి దూసుకెళ్లిన స్కూల్‌ బస్సు

పంట కాలువలోకి దూసుకెళ్లిన స్కూల్‌ బస్సు 23న జిల్లా స్థాయి క్రీడా జట్ల ఎంపికలు కన్నబిడ్డలకు భారం కాలేక ఆత్మహత్యాయత్నం

ఆగిరిపల్లి: డ్రైవర్‌కు ఫిట్స్‌ రావడంతో ప్రమాదవశాత్తూ ఓ ప్రైవేట్‌ స్కూల్‌ బస్‌ పంటబోదెలోకి దూసుకువెళ్లింది. అదృష్టవశాత్తూ బస్సులోని విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఆందరూ ఊపిరి పీల్చుకున్నారు. గురువారం ఉదయం ఈదర నుంచి విద్యార్థులను ఎక్కించుకుని ఆగిరిపల్లికి ఎస్‌ఎఫ్‌ఎస్‌ స్కూల్‌ బస్సు వస్తుంది. ఈదర అడ్డరోడ్డు వద్దకు వచ్చేసరికి డ్రైవర్‌కు అకస్మాత్తుగా ఫిట్స్‌ రావడంతో బస్సును అదుపు చేయలేకపోయాడు. దీంతో పక్కనే ఉన్న పంట కాలువలోకి దూసుకుపోయింది. బస్సులో ప్రయాణిస్తున్న 35 మంది విద్యార్థులను గ్రామస్తులు బయటకు తీశారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సందర్భంగా ఎంఈఓ–1 హేబేలు మాట్లాడుతూ స్కూల్‌ బస్‌ ప్రమాదానికి గల కారణాలను విచారించి నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఈ నెల 23వ తేదీన ఏలూరు జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని యాజమాన్యాల ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అండర్‌ 14, అండర్‌ 17 బాల బాలికల విభాగాల్లో క్రీడా జట్ల ఎంపికలు నిర్వహించనున్నట్టు స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ జిల్లా కార్యదర్శి కే అలివేలు మంగ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు అండర్‌ జూడో, హ్యాండ్‌బాల్‌ జట్ల ఎంపిక పోటీలు స్థానిక ఇండోర్‌ స్టేడియంలో, బాస్కెట్‌బాల్‌ జట్ల ఎంపికలు కొవ్వలిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జరుగుతాయన్నారు. క్రీడాకారులు విధిగా జిల్లా స్థాయి ఎంట్రీ ఫారాలను తాము చదువుతున్న స్కూల్‌ / కాలేజ్‌ ప్రధానోపాధ్యాయులు లేదా ప్రిన్సిపాల్‌ సంతకాలతో అందజేయాలని, లేని పక్షంలో ఎంపిక పోటీల్లో పాల్గొనడానికి అనర్హులన్నారు. వివరాలకు 90308 94311 నెంబర్‌లో సంప్రదించాలన్నారు.

కొయ్యలగూడెం: వయస్సు మీద పడింది.. కన్న బిడ్డలకు భారమైంది. తన సంతానం అంటున్న సూటిపోటి మాటలకు కలత చెంది చెరువులోకి దూకి తనువు చాలించేందుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాల ప్రకారం పొంగుటూరు గ్రామానికి చెందిన మద్దాల రంగమ్మ (75 ఏళ్లు) వృద్ధురాలి భర్త శేషయ్య మూడేళ్ల కిందట మృతి చెందడంతో కొడుకు శేషారావు వద్ద బతుకీడ్చుతున్నట్లు తెలిపింది. ముగ్గురు కుమార్తెలకు వివాహం చేసి ఎవరి కాపురాలకు వాళ్లను పంపగా, తన వద్ద ఉన్న మూడు ఎకరాల పొలంను కుమారుడికి రాసిచ్చినట్లు పేర్కొంది. తల్లినని కూడా చూడకుండా కొడుకు, కోడలు అనరాని మాటలు అంటూ అవమానాలకి గురి చేస్తున్నారంటూ కన్నీటి పర్యంతమైంది. పంచాయతీ కార్యాలయానికి సమీపంలో ఉన్న ఊర చెరువులోకి దూకడానికి ప్రయత్నిస్తుండగా సర్పంచ్‌ పసుపులేటి రాంబాబు కాపాడారు. రంగమ్మ కుటుంబ సభ్యులకు కబురు పంపినా స్పందించకపోవడంతో పంచాయతీ కార్యాలయంలోని బల్లపైనే కూర్చుని ఆమె రోదిస్తోంది. ప్రస్తుతానికి వృద్ధురాలి సంరక్షణ పంచాయతీ చూసుకునే విధంగా ఏర్పాటు చేసినట్టు సర్పంచ్‌ తెలిపారు. గ్రామ పెద్దలు కలగజేసుకొని వృద్ధురాలికి న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.

పంట కాలువలోకి దూసుకెళ్లిన స్కూల్‌ బస్సు1
1/1

పంట కాలువలోకి దూసుకెళ్లిన స్కూల్‌ బస్సు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement