
మెడికల్ కాలేజీల ప్రైవేటుపరం బాధాకరం
దెందులూరు: పేదలకు ఖరీదైన వైద్య విద్యను చేరువ చేయాలని మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తపన పడ్డారని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలపై దుర్మార్గంగా వ్యవహరిస్తోందని దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పేదలకు వైద్య విద్యను దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందన్నారు. సదుద్దేశంతో మాజీ సీఎం జగన్ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటుచేస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రైవేటుపరం చేయడం వెనకున్న ఆంతర్యాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారన్నా రు. వైద్య విద్య కోసం దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా వైఎస్ జగన్ సంస్కరణలు తీసుకువస్తే వాటిని చెరిపేసే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. దెందులూరు నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితి బిహార్‌ను అధిగమించిందని, అక్రమ కేసు లు, దాడులు, దౌర్జన్యాలు, కొట్లాటలు, శిలాఫలకా లు, బోర్డులు ధ్వంసం అజెండాగా కూటమి పాల కులు పనిచేస్తున్నారన్నారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం ఆలోచనను కూటమి ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ నాయకులు ముంగర సంజీవ్‌కుమార్, పెనుమాల విజయ్‌బాబు, మేక లక్ష్మణరావు, ముదుగురు సూర్యనారాయణ, డీబీఆర్‌కే చౌదరి, నిట్టా గంగరాజు, జెడ్పీటీసీ నిట్టా లీలానవకాంతం, పెదపాడు ఎంపీపీ భక్తుల రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.