
నీళ్లునములుతున్న కమిషనర్
రాజకీయమా లేక అవినీతా ?
భీమవరం(ప్రకాశం చౌక్): పాలకోడేరు మండలం విస్సాకోడేరులోని పవన్ సుధ నాన్ లేఅవుట్‌కు భీమవరం మున్సిపాలిటీ నీటి సరఫరాను ము న్సిపల్ అధికారులు సమర్థించుకున్నారు. ‘సాక్షి’లో వచ్చిన ‘గొంతెండుతుంటే నాన్ లేఅవుట్‌కు నీళ్లా?’ శీర్షికన కథనానికి వివరణ ఇస్తూ తప్పు చేయలేదని పేర్కొన్నారు. అయితే ఆ వివరణలో నాన్ లేఅవుట్ లేక అప్రూవల్ లేఅవుట్ అనేది పంచాయతీకి సంబంధించిన విషయమని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. అయితే నాన్ లేఅవుట్ లేక అప్రూవుల్ లేఅవుట్ అనే విషయం తెలియకుండా కౌన్సిల్ తీర్మానంలో ఎలా పెడతారు? లేఅవుట్ వివరాలు లేకుండా ప్రత్యేక అధికారిగా ఉన్న జాయింట్ కలెక్టర్ కౌ న్సిల్ తీర్మానంపై ఎలా సంతకం చేస్తారనే దానికి మాత్రం సమాధానం చెప్పలేదు. నిబంధనల ప్ర కారం నాన్ లేఅవుట్‌కు మున్సిపల్ నీళ్లు ఇవ్వచ్చని ఉంటే ఎందుకు కౌన్సిల్ తీర్మానంలో నిబంధనల కాపీ జత చేయలేదు? ఇలా నాన్ లేఅవుట్‌లకు మున్సిపల్ నీళ్లు ఇచ్చుకుంటూ భీమవరం ప్రజలకు నీళ్లు లేకుండా చేస్తారా? అని భీమవరం పట్టణ వాసులు ప్రశ్నిస్తున్నారు. నాన్ లేఅవుట్‌కు నీళ్లివ్వ డం కష్టమని విస్సాకోడేరు పంచాయతీ చేతులు ఎ త్తేస్తే భీమవరం మున్సిపాలిటీ ఫీజులు కట్టించుకుని నీళ్లివ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర నాన్ లేఅవుట్‌లలోని వారు కూడా ఫీజులు చెల్లిస్తే నీళ్లిస్తారా.. అని ప్రశ్నిస్తున్నారు.
విమర్శల వెల్లువ
నాన్ లేఅవుట్‌కు మున్సిపాలిటీ నీటి సరఫరా చే స్తుంటే కలెక్టర్ పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం నుంచి వచ్చిన ఉత్తర్వుల్లో నీటి సరఫరా చేయాలని ఉన్నా.. నాన్ లే అవుట్ అయినా ఫర్వాలేదు డబుల్ ఫీజులు కట్టించుకుని నీళ్లు సరఫరా చేయండి అని ఎక్కడా పేర్కొనలేదు. ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులు గు ర్తించడం లేదు. మున్సిపల్ బైలా ప్రకారం నీళ్లు ఇ స్తున్నాం అని మాత్రమే వివరణలో ఉంది. అయితే నాన్ లేఅవుట్‌కు కూడా ఫీజులు కట్టించుకుని నీళ్లు ఇవ్వచ్చని మాత్రం చెప్పలేదు.
మిగతా నాన్ లేఅవుట్‌లకు ఇస్తారా?
పవన్ సుధా లేఅవుట్‌కు తీర్మానాలు చేసి ప్రభుత్వం నుంచి ఆర్డర్ పాస్ చేయించి మున్సిపాలిటీ నీళ్లు సరఫరా చేస్తున్నట్టుగా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలకు సమీపంలో ఉన్న నాన్ లేఅవుట్‌లకూ మంచినీటి సరఫరా చేస్తారా అన్నదానిపై జిల్లా ఉన్నతాధికారులు సమాధానం చెప్పాల్సి ఉంది.
‘సాక్షి’లో వచ్చిన కథనంపై ఇచ్చిన వివరణ
అక్రమ లేఅవుట్‌కు నీటి సరఫరా కరెక్టే అని సమర్థింపు
వాస్తవాలు రాసిన ‘సాక్షి’కి వివరణ ఇచ్చిన వైనం
కౌన్సిల్ తీర్మానంలో లేఅవుట్ వివరాలు ఎందుకు పెట్టలేదు ?
నాన్ లేఅవుట్‌కు నీళ్లు ఎలా ఇస్తారని పట్టణవాసుల ప్రశ్న
మిగిలిన నాన్ లేఅవుట్‌లకూనీళ్లు ఇస్తారా అని అంటున్న వైనం
భీమవరంలో అనేక ప్రాంతాలకు పైప్‌లైన్ ఉన్నా మంచినీళ్లు అందడం లేదు. శివారు ప్రాంతాలకు పైపులైన్ వేసి నీళ్లు అందించాల్సిన మున్సిపాలిటీ పక్క నియోజకవర్గంలో నాన్ లేఅవుట్‌కు పైపులైన్ వేసి మరీ నీళ్లివ్వడం అనేది రాజకీయ ఒత్తిడా లేక అవినీతి చోటుచేసుకుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టణంలో 39 వార్డుల్లోని అన్ని ప్రాంతాలకు పుష్కలంగా నీళ్లు అందించడంలో లేని ఆసక్తి నాన్ లేఅవుట్‌పై ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు. నాన్ లేఅవుట్‌కు దగ్గరలో ఉన్న మున్సిపల్ పైపు నుంచి పైప్‌లైన్ వేయాలని ఉండి ఎమ్మెల్యే సూచించారని తీర్మానంలో పేర్కొనడం గమనార్హం.

నీళ్లునములుతున్న కమిషనర్