వైఎస్సార్‌టీఏ ఆధ్వర్యంలో గురువులకు సన్మానం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌టీఏ ఆధ్వర్యంలో గురువులకు సన్మానం

Sep 6 2025 5:27 AM | Updated on Sep 6 2025 5:27 AM

వైఎస్

వైఎస్సార్‌టీఏ ఆధ్వర్యంలో గురువులకు సన్మానం

వైఎస్సార్‌టీఏ ఆధ్వర్యంలో గురువులకు సన్మానం రేపు మధ్యాహ్నం ఆలయం మూసివేత హాస్టళ్ల తరలింపు సరికాదు ఎరువుల సరఫరాపై శ్రద్ధ చూపాలి

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వైఎస్సార్‌సీపీ ఉపాధ్యాయ విభాగం, వైఎస్సార్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో గురుపూజా దినోత్సవం సందర్భంగా శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువులను సన్మానించారు. రాష్ట్రవ్యాప్తంగా 16 మంది ఉపాధ్యాయులను సన్మానించగా పశ్చిమగోదావరి జి ల్లాకు చెందిన బొడ్డు రాంబాబు, సున్నం శ్రీనివాసరావు ఉన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి, చంద్రశేఖర్‌ రెడ్డి, వైఎస్సార్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.అశోక్‌కుమార్‌ రెడ్డి, గడ్డం సుధీర్‌, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కె.జాల్‌ రెడ్డి పాల్గొన్నారు.

ద్వారకాతిరుమల: చంద్ర గ్రహణాన్ని పురస్కరించుకుని ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని ఆదివారం మహానివేదన అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు మూసివేస్తామ ని ఆలయ ఈఓ ఎన్‌వీ సత్యనారాయణమూర్తి తెలిపారు. సోమవారం (8వ తేదీన) పుణ్యహవాచనం అనంతరం ఉదయం 9.30 గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే 7న సాయంత్రం జరగాల్సిన ఆర్జిత సేవలను, 8న వేకువజామున జరగాల్సిన సుప్రభాత సేవను రద్దు చేస్తున్నట్టు చెప్పారు. మిగిలిన అన్ని సేవలు యథావిధిగా జరుగుతాయన్నారు. భక్తులు గమనించాలని కోరారు.

కొయ్యలగూడెం: ప్రభుత్వ హాస్టళ్ల తరలింపు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, వాటి బదిలీ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక మెయిన్‌ సెంటర్‌లో ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు చేపట్టిన ఆందోళన శిబిరానికి బాలరాజు వెళ్లి సంఘీభావం తెలిపారు. కొయ్యలగూడెంలోని ప్రభుత్వ బీసీ హాస్టళ్లు రెండింటినీ వేరే మండలాలకు తరలించడాన్ని తప్పుపట్టారు. విద్యార్థులు అత్యధిక శాతం హాజరయ్యే కొయ్యలగూడెంలోని హా స్టళ్లను తరలించడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. కూటమిలోని నా యకులు రాజకీయాలు మాని ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకోవాలన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కొయ్యలగూడెం వల్లే పోలవరం అసెంబ్లీ స్థానాన్ని కూటమి గెలవగలిగింది అనేది జగమెరిగిన సత్యం అని, అయితే కొ య్యలగూడెంలో విద్యారంగాన్ని అణగదొక్కేలా కుట్రలు జరుగుతున్నాయన్నారు. కార్పొ రేట్‌ సంస్థలతో కలి ప్రభుత్వ విద్యారంగాన్ని అడ్డుకోవడం దారుణమన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి దాసరి విష్ణు, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు డి.శివకుమార్‌, ఎం.క్రాంతి కుమార్‌, తాడిగడప ఆంజనేయరాజు తది తరులు పాల్గొన్నారు.

ఏలూరు(మెట్రో): ఎరువుల నిల్వలు తక్కువగా ఉన్న సొసైటీలకు యుద్ధప్రాతిపదికన సరఫరా చేయాలనీ కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. జిల్లాలో ఎరువుల లభ్యత, సరఫరాలపై శుక్రవారం కలెక్టరేట్‌ నుంచి టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఎరువుల పంపిణీపై వ్యవసాయాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నా రు. ఎరువుల నిల్వలు తక్కువగా ఉన్న పెద పాడు, పెదవేగి, ఏలూరు, దెందులూరు, కలిదిండి, ముదినేపల్లి, బుట్టాయగూడెం, చింతలపూడి, ఆగిరిపల్లి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు 500 టన్నుల యూరియాను పంపామన్నారు. యూరియా పంపిణీ, రైతుల సందేహాల నివృత్తి కోసం ఏలూరు వ్యవసాయ శాఖ కార్యాలయంలో కమాండ్‌ కంట్రోల్‌ రూ మ్‌ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. 85004 21967, 89850 21117 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు.

ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు శుక్రవారం కలెక్టర్‌ వెట్రిసెల్వి శుభాకాంక్షలు తెలిపారు.

సన్మానం అందుకుంటున్న బొడ్డు రాంబాబు, సున్నం శ్రీనివాసరావు

వైఎస్సార్‌టీఏ ఆధ్వర్యంలో  గురువులకు సన్మానం 
1
1/2

వైఎస్సార్‌టీఏ ఆధ్వర్యంలో గురువులకు సన్మానం

వైఎస్సార్‌టీఏ ఆధ్వర్యంలో  గురువులకు సన్మానం 
2
2/2

వైఎస్సార్‌టీఏ ఆధ్వర్యంలో గురువులకు సన్మానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement