
ఇంత అసమర్థ సర్కార్‌ని ఎన్నడూ చూడలేదు
గణపవరం: రైతు వ్యతిరేక ప్రభుత్వంగా పేరొందిన కూటమి ప్రభుత్వం చివరికి రైతులకు యూరియా కూడా అందించలేని దుస్థితిలో ఉందని, ఇంతటి అసమర్థ ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు పుప్పాల వాసుబాబు అన్నారు. శుక్రవారం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ నాయకుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా రైతు లు యూరియా కోసం రేయింబవళ్లు ఎదురుచూసి నా బస్తా యూరియా కూడా దొరకడం లేదన్నారు. వైఎస్సార్‌సీపీ పాలనలో యూరియా కొరత అనేదే లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించిన విషయాన్ని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం ఆర్‌బీకేల పేరు మార్చి, రైతులకు అందుబాటులో లే కుండా చేయడంతో పాటు యూరియా కూడా ఇ వ్వడం లేదన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇలా ఉంటే ముఖ్యమంత్రితోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు యూరియా కొరత లేదని చెప్పడం సిగ్గుచేటన్నారు. యూరియా కోసం లైన్లలో నిలిచిన రైతులను వైఎస్సార్‌సీపీ కార్యకర్తలుగా, సంఘ వ్యతిరేక శక్తులుగా చిత్రీకరించడం దారుణమన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పూర్తిస్థాయిలో యూరియాను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఈనెల 9న ఏలూరులో నిర్వహించే ఆందోళనా కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. యూరియా కొరతపై మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు బెదిరింపు ధోరణికి దిగడం సరికాదన్నారు. వ్యవసాయ మంత్రి గ్రామాలకు వెళితే వాస్తవం ఏమిటో రైతులే తెలియజేస్తారన్నారు. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్లు దండు రాము, సంకు సత్యకుమార్, మరడ మంగారావు, రావిపాటి సత్యశ్రీనివాస్, ఎంపిపిలు ధనుకొండ ఆదిలక్ష్మి, గంటా శ్రీలక్ష్మి, జెడ్పీటిసి సభ్యులు కొరిపల్లి జయలక్ష్మి, కోడే కాశీ, తుమ్మగుంట రంగాభవాని, వైఎస్సార్‌సిపి రాష్ట్ర కార్యదర్శి నడింపల్లి సోమరాజు, వెజ్జు వెంకటేశ్వరరావు, నాలుగు మండలాల బూత్ కన్వీనర్‌లు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే వాసుబాబు