
కదం తొక్కిన ఆటో కార్మికులు
భీమడోలు జంక్షన్‌లో ఆందోళన చేస్తున్న ఆటో కార్మికులు
భీమడోలులో భారీగా ఆటోల ర్యాలీ
భీమడోలు: సీ్త్ర శక్తి పథకం (ఉచిత బస్సు) మా పా లిట శాపంగా మారిందంటూ ఆటోడ్రైవర్లు ఆందోళనకు దిగారు. ఒక్కో ఆటో కార్మికునికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం చేయాలంటూ శుక్రవారం భీమడోలు శ్రీవేంకటేశ్వర ఆటో యూనియన్ ఆధ్వర్యంలో భీమడోలు, పూళ్ల, గుండుగొలను ప్రాంతాలకు చెందిన 120 ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. భీమడోలు జంక్షన్ వద్ద మానవహారం చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని వారంతా భీమడోలు జంక్షన్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో అందించారు. ఈ సందర్భంగా జిల్లా సీఐటీయూ అధ్యక్షుడు ఆర్.లింగరాజు మా ట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు ఏడాదికి రూ.15 వేల ఆర్థిక సాయం చే స్తామని హామీ ఇచ్చిందని, ఇప్పటికీ ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. ఉచిత బస్సుతో ఆటో కార్మికుల ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని, వెంటనే కార్మికులకు ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మోదీ ప్రభుత్వం తెచ్చిన మోటార్ వెహికల్ చట్ట సవరణలను ఉపసంహరించుకోవాలన్నారు. క్రూడాయిల్ తగ్గుతున్నా పె ట్రోలు, డీజిల్ ధరలు తగ్గించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం మేల్కొని ఆటో కార్మికులను ఆదుకోవాలని, లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆటో యూనియన్ల అధ్యక్షులు సీరా సాంబశివరావు, డి.పైడియ్య, నల్లమిల్లి నాగరాజు, ఉపాధ్యక్షుడు ముప్పిడి సతీష్, కార్యదర్శి రాచేటి యోహాన్, సిద్దాబత్తుల పండు, సంయుక్త కార్యదర్శి కూరపాటి సర్వేశ్వరరావు, కోశాధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వ తీరుపై ఆందోళన

కదం తొక్కిన ఆటో కార్మికులు