
యూరియా సరఫరాలో కూటమి విఫలం
బుట్టాయగూడెం: ఖరీఫ్ సీజన్ ముగుస్తున్నా కూ టమి ప్రభుత్వం రైతులకు యూరియా అందించడంలో పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. బుట్టాయగూడెంలో పా ర్టీ సీనియర్ నేత ఆరేటి సత్యనారాయణ ఇంటి వద్ద గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యూరియాను రైతులకు అందకుండా బ్లాక్‌లో విక్రయిస్తూ రైతులను కష్టాలు పాలు చేస్తున్నారన్నారు. పంటల బీమా లేక రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. సీఎం చంద్రబాబు అమరావతిలో కూర్చుని ఉచిత సలహాలు ఇస్తున్నారని విమర్శించారు. వరికి రైతులు యూరియా వేయొద్దని సలహా ఇవ్వడం శోచనీయమన్నారు. ఆయన తనయుడు లోకేష్ గళ్లాపెట్టె సర్దుకుంటున్నారని, పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్‌లో బిజీ అయిపోయారని మండిపడ్డారు. ఈ పరిస్థితుల్లో రైతును పట్టించుకునే నా థుడే కరువయ్యాడన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే రైతుల దయనీయ స్థితి అర్థమవుతుందన్నారు. పొ గాకు, మిర్చి, పామాయిల్ ఇలా ఏ పంట చూసినా గిట్టుబాటు ధర లేదన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు సరఫరా చేయడంతో పాటు విత్తు నుంచి పంటల విక్రయాల వరకూ అండగా నిలిచారన్నారు. కరోనా కష్టకాలంలోనూ అన్నివిధాలా అండగా నిలిచారన్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా పొ గాకు కొనుగోలు చేయించి గిట్టుబాటు ధర కల్పించారన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం యూరియా సరఫరా చేయకపోతే రైతులే ప్రభుత్వానికి ఉరి వేస్తారన్నారు. రైతు సమస్యలపై ఈనెల 9న జంగారెడ్డిగూడెం ఆర్‌డీఓ కార్యాలయం వద్ద జరిగే ధర్నా కార్యక్రమంలో నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. జెడ్పీటీసీ మొడియం రామతులసి, పార్టీ జిల్లా కార్యదర్శి సయ్యద్ బాజీ, పార్టీ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు తాళ్లూరి ప్రసాద్, జిల్లా విభజన విభాగం ఉపాధ్యక్షుడు బగ్గి దినేష్, సర్పంచ్‌లు బన్నే బుచ్చిరాజు, తెల్లం వెంకటలక్ష్మి, మాల్చి వెంకన్నబాబు, నాయకులు తెల్లం దేవరాజు, రవి తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే బాలరాజు