
తమ్మిలేరు ఉగ్రరూపం
చింతలపూడి: జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తోడు ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు తమ్మిలేరు రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. సోమవారం ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి 5,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నీటిమట్టం 349 అడుగులకు, గోనెలవాగు బేసిన్ 348.88 అడుగులకు చేరుకుంది. ఖమ్మం జిల్లా బేతుపల్లి అలుగు పైనుంచి నీరు ప్రవహిస్తుండటంతో గంటకు 7,000 క్యూసెక్కుల నీరు ఆంధ్రా కాల్వ ద్వారా ప్రాజెక్టులోకి వస్తోందని ఏఇ లాజర్‌బాబు తెలిపారు. శివపురం, చిన్నంపేట గ్రామాల మధ్య కాజ్‌వేపై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.
6 వేల క్యూసెక్కులు విడుదల
ఏలూరు(మెట్రో): తమ్మిలేరు వరద నేపత్యంలో నాగిరెడ్డి డ్యామ్ నుంచి దిగువ ప్రాంతాలకు 6,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. నీటిమట్టం పెరిగే అవకాశాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి సహాయం కావాలన్నా 112కు కాల్ చేయాలని కోరారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఎస్పీ కె.కిషోర్ కోరారు. పోలీస్ శాఖ పూర్తి సిద్ధంగా ఉందని తెలిపారు.
నిలిచిన రాకపోకలు
చాట్రాయి: మండలంలోని చిన్నంపేటలో తమ్మిలేరు వరద వంతెనను తాకి ప్రవహిస్తోంది. ఇదే గ్రామం వద్ద డైవర్షన్ ద్వారా సీకే పాడు చానల్‌కు వరద ప్రవహిస్తుండడంతో చిన్నంపేట, కోటపాడు గ్రామాల్లోని చెరువులకు భారీగా వరద నీరు చేరింది.
మొదటి ప్రమాద హెచ్చరిక జారీ