
ఏఆర్‌డీజీకే విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): స్థానిక ఆదివారపు పేటలోని ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నగరపాలక ఉన్నత పాఠశాల విద్యార్థులు ఇటీవల ఇండోర్ స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి మహిళా వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వీ. కాంతి జయకుమార్ తెలిపారు. ఈ మేరకు విద్యార్థుల అభినందన కార్యక్రమం మంగళవారం పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం మాట్లాడుతూ జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీల్లో 8వ తరగతి చెందిన కే. భార్గవి 58 కేజీల విభాగంలో తృతీయ స్థానం, కే.మేఘన 63 కేజీల విభాగంలో ద్వితీయ స్థానం, 9వ తరగతి విద్యార్థిని ఎం.పావని 44 కేజీల విభాగంలో ప్రథమ స్థానం, సీహెచ్. కీర్తన 58 కేజీల విభాగంలో ప్రథమ స్థానం, ఎస్‌డీ మహీన్ 48 కేజీల విభాగంలో ప్రథమ స్థానం, ఎం.దీక్షిత 44 కేజీల విభాగంలో ద్వితీయ స్థానంలో నిలిచారన్నారు. పదో తరగతి విద్యార్థిని సీహెచ్.హారిక రెడ్డి 63 కేజీల విభాగంలో ప్రథమ స్థానం, ఎన్.విహారిక 77 కేజీల విభాగంలో ప్రథమ స్థానం, జీ. పవిత్ర 58 కేజీల విభాగంలో ద్వితీయ స్థానం, పీ.ఇందు 44 కేజీల విభాగంలో తృతీయ స్థానం, ఎం.అనూష 53 కేజీల విభాగంలో తృతీయ స్థానం, షేక్. ఆశాజ్యోతి 77 కేజీల విభాగంలో ద్వితీయ స్థానం సాధించారన్నారు. అలాగే అథ్లెటిక్స్‌లో కిలోమీటర్ విభాగంలో జే. పల్లవి ప్రథమ స్థానం సాధించారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాయామ ఉపాధ్యాయులు తోట శ్రీనివాస్ కుమార్, అబ్బ దాసరి జోజి బాబు, ఇతర ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థుల సంఘం నాయకులు అభినందనలు తెలిపారు.