
యాప్‌లతో వేగలేం
పాలకోడేరు: సెల్‌ఫోన్లు ప్రభుత్వానికి తిరిగిచ్చేయాలనే నిర్ణయంతో సోమవారం విస్సాకోడేరు సీడీపీఓ కార్యాలయం వద్ద సెల్‌ఫోన్‌లను అప్పగించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ నాయకురాలు మహాలక్ష్మి మాట్లాడుతూ సిగ్నల్స్ లేక ఫోన్లు పనిచేయక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నామని, అనేకసార్లు ప్రభుత్వ అధికారులకు తెలియచేసినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో యూనియన్ రాష్ట్ర కమిటీ సెల్‌ఫోన్లు ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించిందన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని లేదంటే మరింత తీవ్రంగా ఉద్యమిస్తామని అన్నారు. సీఐటీయు జిల్లా నాయకుడు ఎం.ఆంజనేయులు పాల్గొని పోరాటానికి సంఘీభావం తెలిపారు. అంగన్‌వాడీలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఏలూరులో..
ఏలూరు(టూటౌన్): పనిచేయని స్మార్ట్‌ఫోన్లు మాకొద్దు అంటూ అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ఏఎస్‌ఆర్ స్టేడియం వెనుకవైపున ఉన్న ఐసీడీఎస్ ఏలూరు ప్రాజెక్టు కార్యాలయం వద్ద సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పని చేయని స్మార్ట్‌ఫోన్ల తో డేటా వివరాలు నమోదు చేయలేకపోతున్నామన్నారు. 5జీ టెక్నాలజీ యాప్‌లతో ఓల్డ్ వెర్షన్ ఫోన్లో ఎలా అప్‌లోడ్ చేయాలన్నారు. ప్రాజెక్ట్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు షేక్ సమీమా, తలారి రజని మాట్లాడుతూ ప్రభుత్వం కొత్త ఫోన్లు ఇచ్చే వరకు మాన్యూవల్ పద్ధతిలోనే పని చేస్తామన్నారు. రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
కై కలూరులో..
కై కలూరు: అంగన్‌వాడీ టీచర్లుకు ఇచ్చిన సెల్ ఫోన్లు పనిచేయడం లేదు. పైగా మూడు యాప్‌లలో వివరాలు నమోదు చేయడం కష్టమవుతోంది అంటూ అంగన్‌వాడీ కార్యకర్తలు కై కలూరులో సెక్టార్ ఆఫీసు సూపర్‌వైజర్ ప్రసన్న లక్ష్మీకి సోమవారం సెల్‌ఫోన్లు ఇచ్చేశారు. కై కలూరు నియోజకవర్గం నాలుగు మండలాల్లో కలపి మొత్తం 311 సెల్‌ఫోన్లు వెనక్కి ఇచ్చేశారు. అంగన్‌వాడీ కార్యకర్తల ప్రాజెక్టు సెక్రటరీ సుజాత మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అంగన్‌వాడీ సెంటర్లలో యాప్‌ల గొడవ లేకుండా చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇప్పడు మూడు యాప్‌లు కలపి ఒక యాప్‌గా చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికై న సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.
సెల్‌ఫోన్లు తిరిగిచ్చేసిన అంగన్‌వాడీ కార్యకర్తలు

యాప్‌లతో వేగలేం

యాప్‌లతో వేగలేం