
జ్వరంతో చికిత్స పొందుతూ చిన్నారి మృతి
కుక్కునూరు: పుట్టిన రోజు జరుపుకోవాల్సిన రోజే జ్వరంతో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందిన ఘటన సోమవారం జరిగింది. చిరవెల్లి గ్రామానికి చెందిన యర్నం ప్రదీప్, కావేరి దంపతులకు సహస్ర(6), స్నేహిత (3) సంతానం. సహస్రకు గత నెల 31న తీవ్రజ్వరం రావడంతో కుటుంబసభ్యులు భద్రాచలం ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ పాపకు పరీక్షలు చేసిన వైద్యులు ప్లేట్‌లెట్‌లు తగ్గినట్టు చెప్పి చికిత్సను ప్రారంభించారు. శనివారం పాపకు జ్వరం తగ్గకపోగా ప్లేట్‌లెట్‌ల సంఖ్య 15 వేలకు పడిపోయి పరిస్థితి విషమించడంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం ఖమ్మంకు రిఫర్ చేశారు. ఖమ్మం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా చిన్నారి మృతి చెందింది.