
మహిళల భద్రత ప్రశ్నార్థకం
బుధవారం శ్రీ 23 శ్రీ జూలై శ్రీ 2025
సాక్షి ప్రతినిధి, ఏలూరు : చిన్నారులకు రక్షణ లేదు. గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ గురించి పూర్తిగా తెలియకుండానే అత్యాచారాలకు గురవుతున్నారు. గంజాయి మత్తులో మానవ మృగాలు వావీవరుసలు చూడకుండా అత్యాచారాలకు తెగబడుతున్నారు. ప్రశాంతతకు మారుపేరైన ఉమ్మడి పశ్చిమలో ఓ వైపు గంజాయి గుప్పుమంటుంటే.. మరోవైపు అత్యాచార ఘటనలు వ్యవస్థకే సవాలుగా మారుతున్నాయి. అత్యాచారం జరిగాక.. అది కూడా బాధితులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు చేస్తే సాధారణ కేసుల్లాగా ఫోక్సో కేసులు నమోదు చేసి చేతులు దులుపుకోవడం మినహా పోలీస్ వ్యవస్థ మరేమి చేయకపోవడంతో మహిళా భద్రత ప్రశ్నార్ధకంగా మారింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో చిన్నారులు మొదలుకొని అనేక మందిపై లైంగిక దాడులు, అత్యాచారాల ఘటనలు తరుచూ జరుగుతున్నాయి. ప్రధానంగా గంజాయి మత్తులో ఎక్కువ నేరాలు ఘటనలు జరుగుతున్నట్లు గుర్తించినా కట్టడి చేస్తున్న దాఖలాలు అంతగా లేదు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల పోలీసులు గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నాం.. పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేస్తున్నామని ప్రత్యేక సదస్సులు, సెమినార్లు నిర్వహిస్తున్నారే తప్పా మూలాల్లోకి వెళ్ళి కట్టడికి ప్రయత్నించని పరిస్ధితి. ఏలూరు జిల్లాలో ఇంతవరకు 20 గంజాయి కేసులు నమోదు చేసి 700 కేజీల గంజాయిని సీజ్ చేసి 40 మందిని అరెస్టు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో 64 కేసులు నమోదు చేసి 641 కేజీల గంజాయిని సీజ్ చేశారు. అంతే తప్ప ఒడిశా నుంచి ఎలా వస్తుంది.. స్థానిక విక్రేతలు ఎవరు.. గతంలో సస్పెట్ షీట్లు నమోదైన వారు, గతంలో కేసుల్లో అరెస్టు అయినవారు ఏం చేస్తున్నారు.. జిల్లాలో పరిస్ధితి ఏంటనే దానిపై పూర్తి స్థాయిలో సమీక్షించకపోవడంతో ఉమ్మడి జిల్లాలో ప్రతి రోజూ గంజాయి మత్తులో ఏదోచోట దాడులు, దౌర్జన్యాలు సాగుతూనే ఉన్నాయి. దీంతో పాటు అత్యాచార కేసులు కూడా ఎక్కువగా నమోదు కావడం కలవరపరుస్తుంది.
న్యూస్‌రీల్
పశ్చిమలో పేట్రేగిపోతున్న హింసా ప్రవృత్తి
గంజాయి మత్తులో యువత
లైంగిక దాడికి బలవుతున్న చిన్నారులు, యువతులు
పోక్సో కేసులతో సరిపెడుతున్న పోలీసులు
ఉమ్మడి జిల్లాలో వారానికో ఘటన జరిగినా స్పందన శూన్యం

మహిళల భద్రత ప్రశ్నార్థకం