
ఎఫ్‌ఆర్‌ఎస్‌ను తక్షణం రద్దు చేయాలి
అంగన్వాఢీలకు భారంగా మారిన ఎఫ్‌ఆర్‌ఎస్ (ముఖ కవళికల గుర్తింపు) విధానాన్ని తక్షణం రద్దుచేయాలి. నాణ్యమైన సెల్ ఫోన్లు, నెట్ కనెక్షన్లు అందించాలి.ఇతర కారణాల వల్ల రిజిష్టర్ కాని అంగన్వాఢీ లబ్దిదారులకు మాన్యూవల్‌గా రేషన్ అందించేందుకు అవకాశం కల్పించాలి.
– పి.సుజాత, అధ్యక్షురాలు, అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్
కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అంగన్‌వాడీ కార్యకర్తలకు నెలకు రూ.26 వేలు కనీస వేతనం అందించాలి. పీఎఫ్, ఉద్యోగ భద్రత, గ్రాట్యుటీ అందించాలి. అంగన్‌వాడీలపై రాజకీయ వేధింపులను తక్షణం నిలుపుదల చేయాలి. అంగన్‌వాడీల పోరాటానికి సీఐటీయూ మద్దతు ఇస్తుంది.
– డీఎన్‌వీడీ ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి, సీఐటీయూ
హామీలను నెరవేర్చాలి
ముఖ్యమంత్రి చంద్రబాబు అంగన్‌వాడీల సమస్యల పరిష్కారానికి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది దాటినా చిరు ఉద్యోగులమైన అంగన్‌వాడీల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించడం తగదు. అవసరమైతే కేంద్రంతో మాట్లాడి ఎఫ్‌ఆర్‌ఎస్ విధానాన్ని రద్దుచేసేలా చూడాలి.
– పి.భారతి, ప్రధాన కార్యదర్శి, అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్
సంక్షేమ పథకాలను అమలు చేయాలి
అంగన్వాఢీ వర్కర్స్, హెల్పర్స్‌కు ప్రభుత్వ సంక్షేమ పధకాలు అన్నింటినీ అమలు చేయాలి. తల్లికి వందనం పథకంను అంగన్వాఢీలకు ఇవ్వక పోవడం సరికాదు. మినీ సెంటర్‌లను మెయిన్‌సెంటర్‌లుగా మార్చాలి. సెంటర్ మెయింటినెన్స్ ఛార్జీలు చెల్లించాలి. అపరిష్కృతంగా ఉన్న అంగన్వాఢీల సమస్యలపరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.
– టి.మాణిక్యం, కోశాధికారి, అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్
●

ఎఫ్‌ఆర్‌ఎస్‌ను తక్షణం రద్దు చేయాలి

ఎఫ్‌ఆర్‌ఎస్‌ను తక్షణం రద్దు చేయాలి

ఎఫ్‌ఆర్‌ఎస్‌ను తక్షణం రద్దు చేయాలి