
కూటమి వైఫల్యాలను నిలదీయాలి
జంగారెడ్డిగూడెం: కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజా క్షేత్రంలో ప్రజలకు వివరిస్తూ నిలదీయాలని వైఎస్సార్‌సీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయరాజు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక రాజారాణి కళ్యాణ మండపంలో జరిగిన శ్రీబాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటిశ్రీ, వైఎస్సార్ సీపీ మండల, పట్టణ స్థాయి విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు చేసిన మొదటి సంతకం ఫైలు మెగా డీఎస్సీ ఎక్కడ అని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఏదని, అన్నదాత సుఖీభవ ఎక్కడని ప్రశ్నించారు. తల్లికి వందనం పేరుతో లక్షలాది మంది విద్యార్థులను అనర్హులుగా ప్రకటించి వారికి తల్లికి వందనం వేయలేదని ఆరోపించారు. హామీలు నెరవేర్చేవరకు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. చిత్తూరులో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెళితేనేగాని రైతులకు న్యాయం జరగలేదన్నారు. హామీలు నెరవేర్చడం చేతకాకపోతే చంద్రబాబు గద్దె దిగాలని డిమాండ్ చేశారు.
ప్రజా సంక్షేమం కోరే వ్యక్తి జగన్
పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకుడు జెట్టి గురునాథరావు మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోరే వ్యక్తి జగన్ అని, విలువల ప్రజా పాలన అందించారన్నారు. కరోనా సమయంలో కూడా సంక్షేమాన్ని అమలు చేశారని, అలాగే రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించారన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మలేదని, కానీ పవన్ కళ్యాణ్ చేస్తాడని ఆశ పడ్డారని, దీని కోసం ఇద్దరు సంతకాలతో ఒక బాండ్ పేపర్ ప్రజలకు పంచి మొత్తం ముంచేశారన్నారు. ఏలూరు పార్లమెంట్ ఇన్‌చార్జి కారుమూరి సునీల్‌కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని, అధైర్యపడవద్దని, జగనన్న ప్రతి ఒక్కరికి అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కీసర సరితా విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు తొందరలోనే బుద్ధి చెబుతారన్నారు. సమావేశంలో పట్టణ, మండల కమిటీ అధ్యక్షులు కర్పూరం గవరయ్య గుప్త, ఓరుగంటి నాగేంద్ర, మున్సిపల్ చైర్‌పర్సన్ బత్తిన లక్ష్మి, ఎంపీపీ కొదమ జ్యోతి, ముప్పిడి శ్రీను, బీవీఆర్ చౌదరి, మండవల్లి సోంబాబు, చింతా అనిల్, గురజాల పార్థసారథి, వైస్ చైర్మన్‌లు ముప్పిడి అంజి, కంచర్ల వాసవీరత్నం, పట్టణ, మండల మాజీ అధ్యక్షులు చిటికెల అచ్చిరాజు, వామిశెట్టి హరిబాబు, పార్టీ నాయకులు బత్తిన చిన్న, ఘంటసాల గాంధీ, కౌన్సిలర్‌లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధిక సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. ఇటీవల జంగారెడ్డిగూడెం పట్టణ, మండల కమిటీ అధ్యక్షులుగా నియమితులైన కర్పూరం గవరయ్య గుప్త, ఓరుగంటి నాగేంద్రలచే సమావేశంలో కంభం విజయరాజు ప్రమాణస్వీకారం చేయించారు. అలాగే మండలంలోని గ్రామాల పట్టణంలోని వార్డు కమిటీలను సభకు పరిచయం చేశారు.
వైఎస్సార్ సీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయరాజు

కూటమి వైఫల్యాలను నిలదీయాలి