
సౌత్ జోన్ రోల్‌బాల్ పోటీలకు ఎంపిక
తణుకు అర్బన్: ఆంధ్రప్రదేశ్ రోల్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 19, 20 తేదీల్లో కాకినాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో అండర్ 17, 17 ఏళ్లు పైబడిన విభాగాల్లో పశ్చిమగోదావరి జిల్లా క్రీడాకారులు ద్వితీయస్థానంలో నిలిచినట్లు రోల్‌బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి వానపల్లి లావణ్య తెలిపారు. వీరిలో ఉత్తమ ప్రతిభ కనబరచిన క్రీడాకారులు ఆగస్టులో నిర్వహించనున్న సౌత్ జోన్ రోల్‌బాల్ పోటీల్లో పాల్గొంటారని వివరించారు. ఇటీవల తణుకులో నిర్వహించిన స్కేటింగ్ రోల్‌బాల్ పోటీల్లో పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి అండర్ 11, 14, 17, 17 ఏళ్లు పైబడిన వారికి నిర్వహించిన పోటీల్లో అర్హత సాధించిన 20 మంది క్రీడాకారులు కాకినాడలో రోల్‌బాల్ పోటీల్లో పాలొన్నారని చెప్పారు.
రైతుల ఆందోళనకు
దిగొచ్చిన అధికారులు
ఉంగుటూరు: రైతుల ఆందోళనకు అధికారులు దిగొచ్చారు. ఎట్టకేలకు తోకలపల్లి మురుగుకోడు రావులపర్రు రెగ్యులేటర్ షట్టర్లను మంగళవారం ఎత్తడంతో తోకలపల్లి కోడులో ఉద్ధృతంగా ఉన్న నీరు లాగడం మొదలుపెట్టింది. ఈక్రమంలో నారమళ్లు ముంపు నుంచి తేరుకునే పరిస్థితి ఏర్పడుతోంది. వ్యవసాయ అధికారి ప్రవీణకుమార్ నారుమడులను పరిశీలించి రైతులకు సూచనలు అందజేశారు. తోకలపల్లి కోడులో నీరు ఉద్ధృతంగా ఉండడంతో తమ నారుమళ్లు ముంపు బారిన పడుతున్నాయని రావులపర్రు గ్రామ రైతులు రెగ్యులేటరు వద్ద ఆందోళన చేయడం, ఏలూరు వెళ్లి కలెక్టర్‌కు పరిస్థితిని వివరించడం జరిగింది. తోకలపల్లి మురుగుకోడు షట్టర్లు ఎత్తడంతో రైతులు ఊపిరిపిల్చుకున్నారు.

సౌత్ జోన్ రోల్‌బాల్ పోటీలకు ఎంపిక