
జనసేన వికృత చేష్టలు బాధాకరం
వైఎస్సార్‌సీపీ చింతలపూడి ఇన్‌చార్జి విజయరాజు
ఏలూరు (టూటౌన్): మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కాన్వాయ్‌పై జనసేన మూ కల వికృత చేష్టలు బాధాకరమని వైఎస్సార్‌సీపీ చింతలపూడి నియోజకవర్గ ఇన్‌చార్జి కంభం విజయ రాజు అన్నారు. నగరంలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ ఏపీ స్టేట్ క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు బొల్లవరపు జాన్ వేస్లితో కలిసి మాట్లాడుతూ జిల్లాలో క్రిస్టియన్ల సమస్యలపై వైఎస్సార్‌సీపీ కార్యాచరణ సిద్ధం చేసి భరోసా కల్పించనుందన్నారు. తణుకులో కారుమూరి కా న్వాయ్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇది ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రచార రథంపై జనసేన కార్యకర్తల వీరంగం సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. జనసేన నాయకులు అధికారం నెత్తికెక్కి అహంకారం ప్రదర్శిస్తున్నారని, రాబోయే రోజుల్లో కచ్చితంగా వైఎస్సార్‌సీపీ రిటర్న్ గిఫ్టు ఇస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.