
శ్రావణం.. శుభప్రదం
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట)/బుట్టాయగూడెం/ ద్వారకా తిరుమల: హిందువులకు అత్యంత శుభప్రదమైన మాసం శ్రావణం. ప్రత్యేక వ్రతాలు, నోములతో పాటు ఆలయాల్లో విశేష పూజలు చేస్తారు. ఆషాఢం తర్వాత శుభ ముహూర్తాలు మొదలుకానుండటంతో అంతటా శుభకార్యాల సందడి కనిపిస్తుంది. ప్రత్యేకంగా శుక్రవారాల్లో లక్ష్మీదేవికి వ్రతాలు, మంగళవారాల్లో మంగళ గౌరీ వ్రతాలు ఆచరిస్తారు. ఈ మాసంలో ప్రతిరోజూ ఒక్కో దేవతామూర్తికి విశేషమైనదిగా స్కాంద పురాణంలో చెప్పినట్టు పండితులు తెలుపుతున్నారు. శుక్రవారం నుంచి శ్రావణమాసం ప్రారంభం కానుంది.
పర్వదినాలు.. ప్రత్యేక పూజలు
● ఆగస్టు 8న వరలక్ష్మి వ్రతం.. శ్రావణ మాసంలో రెండో శుక్రవారం మహిళలు వరలక్ష్మి వ్రతాలు ఆచరిస్తారు.
● 9న రాఖీ పౌర్ణమి.. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా శ్రావణ పౌర్ణమిని రాఖీ పౌర్ణమిగా జరుపుకుంటారు. దీనినే జంధ్యాల పౌర్ణమి అని పిలుస్తారు.
● 12న సంకష్ట హర చతుర్థి వ్రతం: శ్రావణ బహుళ చవితి నాడు ప్రధాన సంకష్ట హర చతుర్థి వ్ర తాలు జరుపుకుంటారు. గణపతి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు.
● 16న శ్రీకృష్ణ జన్మాష్టమి.. శ్రావణ బహుళ అష్టమి నాడు శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని జరుపుకుంటారు.
● 23న పోలాల అమావాస్య: ఈ రోజుతో శ్రావణ మాసం ముగియనుంది. ఈ సందర్భంగా పోలాల అమావాస్య జరుపుకుంటారు.
వ్యాపారుల్లో నూతనోత్సాహం
శ్రావణ మాసం అంటే వ్యాపారుల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తుంది. వస్త్ర, స్వర్ణ, పూజా సామగ్రి, పూలు, పండ్లు, నిత్యావసర వస్తువుల వ్యాపారాలు జోరందుకుంటాయి. వస్త్ర, బంగారు ఆభరణాల వ్యాపారులు ఆఫర్లతో మహిళలను ఆకర్షిస్తుంటారు.
పండుగలు, ప్రత్యేక దినాలకు నెలవు
ఆలయాల్లో ప్రత్యేక పూజలు
విశిష్ట మాసం
శ్రావణ మాసానికి ఎంతో విశిష్టత ఉందని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. ఈ నెలలో ఆలయాల్లోని అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు ఆచరించడం అత్యంత పుణ్యప్రదం. తమ కుటుంబాలు పదికాలాల పాటు చల్లగా ఉండాలని మహిళలు వరలక్ష్మీ వ్రతా లు, మంగళగౌరీ వ్రతాలు ఆచరించుస్తుంటా రు. గృహప్రవేశాలకు, శంకుస్థాపనలకు, చా తుర్మాస్య దీక్షలకు ఈ మాసం విశిష్టమైంది.
– గుడిమెట్ల బాలకృష్ణ కిషోర్ శర్మ అవధాని, జ్యోతిష పండితుడు

శ్రావణం.. శుభప్రదం