అందని సాయం.. అన్నదాత ఆక్రోశం | - | Sakshi
Sakshi News home page

అందని సాయం.. అన్నదాత ఆక్రోశం

Jul 25 2025 4:33 AM | Updated on Jul 25 2025 4:33 AM

అందని

అందని సాయం.. అన్నదాత ఆక్రోశం

శురకవారం శ్రీ 25 శ్రీ జూలై శ్రీ 2025

రైతులపై అధనపు భారాలు

రైతులకు ఊరటనిస్తూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పక్కన పెట్టిన నీటి తీరువాను కూటమి తెరపైకి తెచ్చింది. పంట పొలాలకు ఎకరానికి ఏడాదికి రూ.350, ఆక్వా చెరువులకు రూ.500 చొప్పున రైతుల ఖాతాల నుంచి వసూలుకు ఆదేశాలిచ్చింది. మరోపక్క మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తెచ్చిన ఉచిత పంటల బీమా పథకాన్ని కూటమి ఎత్తివేసి ప్రీమియం భారాన్ని రైతులపై మోపింది. ఎకరానికి రూ.210లు చొప్పున ప్రీమియాన్ని ఆగస్టు 15లోపు రైతులు చెల్లించాల్సి ఉంది. ఇలా సీజన్‌ ప్రారంభంలోనే నీటితీరువా, బీమా ప్రీమియం రూపంలో ఖరీఫ్‌ రైతులపై రూ.కోట్ల భారం పడింది.

ఏలూరు (మెట్రో): రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే రైతులు ఆనందంగా ఉండాలి. రైతులు ఆనందంగా ఉండాలంటే ఆర్థికంగా సాయం అందాలి. పండించిన పంటకు మద్ధతు ధర సైతం అందాలి. అయితే ప్రస్తుతం రైతుకు ఏమాత్రం ఇవేమీ అందడం లేదు. రైతులకు పండించిన పంటలకు మద్దతు ధరలూ లేకుండా పోయాయి.

గతంలో సాగు ఆరంభంలో..

జిల్లావ్యాప్తంగా రైతులంతా ఖరీఫ్‌ సాగుకు సిద్ధమయ్యారు. సాగు ప్రారంభంలో రైతులకు పెట్టు బడి సాయం ఎంతో అవసరం. దీనిని గుర్తించిన గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నేరుగా రైతులకు సీజన్‌ ఆరంభంలోనే రైతు భరోసా పేరుతో పెట్టుబడి సాయం అందించేది. దీంతో రైతులు ఆనందంగా వ్యసాయ సీజన్‌ను ప్రారంభించేవారు. గత ఎన్నికల సమయంలో రైతుభరోసాకు అదనంగా నిధు లు సమకూర్చి రైతులకు ఏటా రూ.20 వేలు ఇ స్తా మని చెప్పిన కూటమి నాయకులు గద్దెనెక్కి ఏడాది గడిచినా ఒక్క రూపాయి సాయం ఇవ్వలేదు.

వర్షాలతో ఊపందుకున్న పనులు

జిల్లావ్యాప్తంగా మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వ్యవసాయ పనులకు రైతులు పొలం బాట పట్టారు. అయితే విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు వంటివి కొనుగోలుకు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన దుస్థితి నెలకొంది. రైతుల ఆర్థిక అవసరాలను ఆసరాగా తీసుకుని దళారులు అప్పులు ఇచ్చి దోచుకునేందుకు ముందుకు వస్తున్నారు.

సుఖీభవపై సాగదీత : ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి ఎంతమంది రైతులు అర్హత సాధిస్తున్నారో గుర్తించాలని వ్యవసాయ శాఖకు ఆదేశాలు రావడంతో నాలుగు నెలలుగా రైతుల జాబితాను జిల్లా వ్యవసాయశాఖ అధికారులు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఈ జాబితాను పూర్తి చేసి సుమారు నెల రోజులు కావస్తుంది. అంతే కాకుండా రైతుల ఈకేవైసీ సైతం వ్యవసాయశాఖ అధికారులు పూర్తి చేశారు. అయినా ఇప్పటికీ ‘అన్నదాత సుఖీభవ’ నిధులను ఎప్పుడు విడుదల చేస్తారనే విషయాన్ని మాత్రం కూటమి సర్కారు స్పష్టం చేయలేదు.

అర్హుల జాబితాల్లో భారీ వ్యత్యాసం

ఇదిలా ఉంటే గతంలో ఉన్న రైతుల జాబితాకు ప్రస్తుతం సిద్ధం చేసిన రైతుల జాబితాకు భారీ స్థాయిలో వ్యత్యాసం ఉంది. గత వైస్సార్‌సీపీ ప్రభుత్వం (2023)లో సుమారు 2 లక్షల మందికి రైతు భరోసా నిధులు విడుదల చేయగా.. ప్రస్తుతం జిల్లాలో 1,64,270 మంది మాత్రమే అర్హులుగా జాబితాను సిద్ధం చేశారు. సుమారు 40 వేల మంది రైతు కుటుంబాలను గత జాబితాలో నుంచి తొలగించేశారు. దీంతో ఎంతమంది రైతులకు సాయం అందుతుంది, ఎందరికి అందదు, ఏ పంటలు సా గు చేస్తున్న రైతులు అర్హులు అనే అంశంపై స్పష్టత లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా కౌలు రైతులకు సైతం అన్నదాత సుఖీభవ నిధులు అందించాలని డిమాండ్‌ చేస్తున్నా ఇప్పటికీ ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వలేదు.

న్యూస్‌రీల్‌

అన్నదాత దుఃఖీభవ

వర్షాలతో ఊపందుకున్న తొలకరి పనులు

పెట్టుబడుల కోసం రైతుల ఇక్కట్లు

నీటితీరువా, బీమా ప్రీమియం భారం మోపిన కూటమి సర్కారు

జూలై గడిచిపోతున్నా అన్నదాత సుఖీభవ ఊసెత్తని వైనం

గత ప్రభుత్వంలో పక్కాగా సాయం విడుదల

సీజన్‌ ప్రారంభమైనా..

వ్యవసాయ సీజన్‌ ప్రారంభమైనా ఇప్పటికీ కూ టమి ప్రభుత్వం రైతులకు ఒక్కరూపాయి కూడా ఆర్థిక సాయం అందించకపోవడం బాధాకరం. రైతులు ఆర్థిక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరింత దుర్భరంగా ఉంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి అన్నదాత సుఖీభవ పథకం నిధులను విడుదల చేసి ఆర్థికంగా రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

–కె.శ్రీనివాస్‌, రైతు సంఘం జిల్లా కార్యదర్శి

అందని సాయం.. అన్నదాత ఆక్రోశం 1
1/2

అందని సాయం.. అన్నదాత ఆక్రోశం

అందని సాయం.. అన్నదాత ఆక్రోశం 2
2/2

అందని సాయం.. అన్నదాత ఆక్రోశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement