
● ‘బ్యాక్ బెంచ్’కి చెక్
● రండి బాబు... రండి
బ్యాక్ బెంచ్ విద్యార్థులు చదువులో వెనుకబడకుండా ఉండేందుకు కలెక్టర్ వెట్రిసెల్వి విన్నూత్న ప్రయోగం చేపట్టారు. కేరళ తరహాలో యూ ఆకారంలో కూర్చునే విధంగా బెంచీలు వేయాలని ఆదేశించారు. దీనిని లింగపాలెం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను మంగళవారం తనిఖీ చేసేందుకు వచ్చిన జిల్లా సమగ్ర శిక్ష ఏపీసీ పంకజ్ కుమార్ అమలు చేశారు. యూ ఆకారంలో బెంచీలు అమర్చడం వలన విద్యార్థులంతా ఉపాధ్యాయునికి కనబడతారని, ఆయన చెప్పే పాఠాలు బాగా అర్థమవుతాయన్నారు. విద్యార్థులు ఆన్‌లైన్ ప్రకారం ఉన్నారా లేరా డ్రాప్ బాక్స్ ఎంతమంది అని పరిశీలించారు. – లింగపాలెం
ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభించి నెల రోజులు దాటినా ఇంకా అడ్మిషన్లు జరుగుతున్నాయంటూ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. గత ప్రభుత్వంలో పాఠశాలలు ప్రారంభమైన వారం రోజులకే క్లాస్‌రూమ్‌లు నిండిపోయి అడ్మిషన్లు ఇచ్చే పరిస్ధితి ఉండేది కాదు. ప్రారంభం రోజే పుస్తకాలు, బ్యాగులు, యూనిఫామ్‌తో పాటు సమయానికి అమ్మ ఒడి ఇచ్చేవారు. కానీ కూటమి ప్రభుత్వంలో సగం మంది తల్లులకు తల్లికి వందనం రాక.. నాణ్యమైన బ్యాగులు ఇవ్వక, సరిగ్గా పుస్తకాలు అందక ప్రభుత్వ పాఠశాలలో చేరేందుకు పిల్లలు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఇలా ఇంకా అడ్మిషన్లు జరుగుతున్నాయంటూ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఏలూరు లక్ష్మివారపుపేటలోని ఎలిమెంటరీ స్కూల్లో దర్శనమిచ్చిన ఫ్లెక్సీ ఇది. – సాక్షి ఫొటోగ్రాఫర్/ ఏలూరు

● ‘బ్యాక్ బెంచ్’కి చెక్