
విద్యాభ్యాసం.. మురుగునీటితో సహవాసం
పోలవరం రూరల్: పోలవరం మండలం ఎల్‌ఎన్‌డీపేట గ్రామంలోని మురుగునీరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలోకి చేరుతోంది. నీరు బయటకు వెళ్లే మార్గంలేక, డ్రెయిన్ సౌకర్యం లేక రోజుల తరబడి నిలిచిపోతోంది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికితోడు వర్షం కురిస్తే ఇక అంతే సంగతులు. పాఠశాల ఆవరణ చెరువును తలపిస్తూ ఉంటుంది. మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులు భోజనం అనంతరం చేతులు శుభ్రం చేసుకునేందుకు ఆ మురుగు నీటిలోనే చేతిపంపు వద్దకు వచ్చి చేతులు శుభ్రం చేసుకోవాల్సిన దుస్థితి. దీంతో విద్యార్థులు అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కచ్చా డ్రెయిన్ తవ్వి నీరు బయటకు పోయేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.

విద్యాభ్యాసం.. మురుగునీటితో సహవాసం