
బెల్ట్ షాపులు తొలగించాలి
దిగొచ్చిన అధికారులు
రైతుల ఆందోళనకు అధికారులు దిగొచ్చారు. ఉంగుటూరు మండలం తోకలపల్లి మురుగుకోడు రావులపర్రు రెగ్యులేటర్ షట్టర్లను మంగళవారం ఎత్తారు. 8లో u
ఏలూరు (టూటౌన్): సందుకో బెల్ట్ షాపుతో కల్లుగీత వృత్తి చిన్నాభిన్నం అయిపోయిందని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక కొత్త బస్టాండ్ సమీపంలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ఏలూరు సర్కిల్ కల్లుగీత కార్మికుల సమావేశం మంగళవారం బెజవాడ వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ జిల్లాలో బెల్ట్ షాపులు ఐదు వేల వరకు ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో కల్తీ మద్యం హల్ చల్ చేస్తున్నా ఎకై ్సజ్ అధికారులు కన్నెత్తి చూడటం లేదని విమర్శించారు. బెల్టు షాపులు పెడితే బెల్టు తీస్తామని సీఎం ఆదేశాల ప్రకారం తక్షణం బెల్ట్ షాపులు తొలగించి కల్లుగీత కుటుంబాలకు ఉపాధి కాపాడాలని విజ్ఞప్తి చేశారు. కల్లుగీత కుటుంబాలను తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కన్నీరు పెట్టిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అనకాపల్లి పరవాడ కేంద్రంగా కల్తీ మద్యం రాకెట్ పాలకొల్లును స్థావరంగా చేసుకొందన్నారు. పాలకొల్లులో కల్తీ మద్యం తయారుచేసి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కాకినాడ జిల్లాలకు పారిస్తున్నట్లు పత్రికలలో వస్తున్నా అధికారులు స్పందించకపోవడం అన్యాయం అన్నారు. హైదరాబాద్ నుంచి స్పిరిట్ తీసుకొచ్చి రంగు నీళ్లు కలిపి బ్రాండెడ్ కంపెనీల బాటిల్స్‌లో నింపి విక్రయిస్తున్నారని. తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత అనుచరుడే కల్తీ దందా నడుపుతున్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోందన్నారు. ఆగస్టు 18న గీత కార్మికులందరూ మన గోడు ఏలూరు కలెక్టర్ గారికి చెప్పుకుందాం కార్యక్రమానికి తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.