
మోసానికి కేరాఫ్ చంద్రబాబు
కై కలూరు: ప్రజలను ఎలా మోసం చేయాలో చంద్రబాబుకు తెలిసినట్లుగా మరొకరికి తెలియదని వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) అన్నారు. కై కలూరు సీతారామ ఫంక్షన్ హాలులో ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ’పై నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం మంగళవారం జరిగింది. బాబు మోసాలను తెలిపే ‘క్యూఆర్ కోడ్’ షీట్‌ను నాయకులు అవిష్కరించారు. డీఎన్నార్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రతిపక్షంగా పోరాడితే కేసులు పెట్టి కూటమి భయపెడుతుందని.. కూటమి నేతలు రెచ్చిగొట్టినా శాంతంగా ఉండాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి జగన్ సీఎం కావడం ఖాయమన్నారు.
ఆక్వా రైతులకు మొండిచేయి : జిల్లాలో ఆక్వా రైతులకు కూటమి ప్రభుత్వం మొండి చేయి చూపిస్తోందని ఏలూరు పార్లమెంటు సమన్వయకర్త కారుమూరి సునీల్‌కుమార్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. పవన్ కల్యాణ్ హరహరవీరమల్లు సినిమాకు రూ.600 టిక్కెట్‌గా నిర్ణయించడం ప్రజలకు భారం కాదా? అన్ని ప్రశ్నించారు.
ప్రజల్లో తగ్గుతున్న కొనుగోలు శక్తి
కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గుతుందని ఏలూరు పార్లమెంటు పరిశీలకుడు వంకా రవంద్రనాథ్ చెప్పారు. ఎన్నికల హామీలను గాలికి వదిలేసిందని విమర్శించారు. వడ్డీ వ్యాపార చక్రంలో ప్రజలు చిక్కుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలందరూ తిరిగి వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడలనుకుంటున్నారని చెప్పారు. ఏలూరు నియోకవర్గ ఇన్‌చార్జి మామిళ్లపల్లి జయప్రకాష్(జేపీ) మాట్లాడుతూ ఉచిత బస్సు తుస్సుమందన్నారు. సీఎం జగన్ నవరత్నాలతో రాష్ట్రంలో పండగ వాతావరణం తెచ్చారని.. ఎన్నికల్లో అధికారంలోకి వస్తే జగన్ కంటే ఎక్కువ ఇస్తానని చెప్పి మోసం చేశారన్నారు. చింతలపూడి నియోజకవర్గ ఇన్‌చార్జి కంభం విజయరాజు మాట్లాడుతూ ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు దిట్టని, రాష్ట్రంలో 2.5 లక్షల వలంటీర్లకు రూ.10 వేలు ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. మెగా డీఎస్పీ ఏమైందని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం సెక్రటరీ గంటా సంధ్య, జిల్లా మహిళా విభాగ అధ్యక్షురాలు సరితారెడ్డి మాట్లాడుతూ మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్ని విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు చిరంజీవి, ఏలూరు జిల్లా యూత్ అధ్యక్షుడు కామిరెడ్డి నాని, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి సుధీర్‌బాబు, మేధావుల ఫోరం రాష్ట్ర నాయకులు బీవీ రావు, వైఎస్సార్‌సీపీ ముదిరాజుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కోమటి విష్ణువర్థన్, జిల్లా ఉపాధ్యక్షుడు చేబోయిన వీరరాజు, పార్టీ ఎంపీపీలు చందన ఉమామహేశ్వరరావు, రామిశెట్టి సత్యనారాయణ, పెద్దిరెడ్డి శ్రీరామదుర్గాప్రసాద్, నాయకులు కూసంపూడి కనక దుర్గారాణి, సయ్యపురాజు గుర్రాజు, బలే నాగరాజు, గాంధీరాజు కిట్టు, ఐనాల బ్రహ్మజీ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్
కై కలూరులో ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ’ సమావేశం

మోసానికి కేరాఫ్ చంద్రబాబు