
చీటింగ్ కేసులో నగదు రికవరీ
చింతలపూడి: చీటింగ్ కేసులో నగదు రికవరీ చేసి బాధితుడికి అందజేశారు. చింతలపూడి డీఎస్పీ యు.రవిచంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్న షేక్ ఖాసింకు చింతలపూడికి చెందిన రాజ్‌కుమార్, ప్రవీణ్ అనే వ్యక్తులు వ్యాపార అవసరాల నిమిత్తం తక్కువ వడ్డీకి డబ్బులు ఇప్పిస్తామని తెలిపారు. దీంతో ఖాసిం వారి మాటలు నమ్మడంతో తొలుత ష్యూరిటీ కింద రూ.50 లక్షలు, కంపెనీ డాక్యుమెంట్స్ తీసుకురావాలని తెలపడంతో ఈ నెల 18న ఖాసిం చింతలపూడి వచ్చారు. అలా వచ్చిన మేనేజర్‌ను రాజ్‌కుమార్, ప్రవీణ్‌లు చింతలపూడిలోని ఎరుకలపేటలోని ఒక ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడ డబ్బులు లెక్కపెట్టే నెపంతో ఇంటిలోకి వెళ్లి తలుపులు వేసుకుని, వేరే మార్గంలో బయటకు వెళ్లారు. ఎంతకు రాకపోవడంతో లోపలికి వెళ్లి చూడగా వారు కనిపించలేదు. తనను మోసం చేశారని గ్రహించిన మేనేజర్ చింతలపూడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డీఎస్పీ పర్యవేక్షణలో సీఐ టి.క్రాంతి కుమార్, ఎస్సై కె.సతీష్‌కుమార్‌లు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితులను పట్టుకుని వారి నుంచి రూ. 50 లక్షలు రికవరీ చేశారు. పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిపేటప్పుడు సదరు వ్యక్తుల గురించి పూర్తిగా సమాచారం తెలుసుకోవాలని డీఎస్పీ అన్నారు. సరైన ధ్రువీకరణ లేకుండా లావాదేవీలు చేయరాదన్నారు.