
స్కాంలకు సహకారం
భక్తుల రద్దీ సాధారణం
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారికి ప్రీతికరమైన రోజు అయినప్పటికీ ఆషాఢ మాసం కావడంతో రద్దీ తగ్గింది.
ఆదివారం శ్రీ 6 శ్రీ జూలై శ్రీ 2025
సాక్షి ప్రతినిధి, ఏలూరు: రైతులకు తెలియకుండా రైతుల పేరుతో కోట్లలో రుణాలు తీసుకుంటారు. రైతుల నుంచి డిపాజిట్లు సేకరించి విచారణ పేరుతో కాలపరిమితి ముగిసినా తిరిగి చెల్లించరు. కార్యదర్శులు మినిట్ బుక్‌లో రాసిందే శాసనం. విచారణాధికారులే కింగ్ మేకర్లుగా మారి సమస్య సృష్టించి దానిని ఫిర్యాదుగా మలిచి దాని మీద విచారణ చేసి కావాల్సిన మేరకు దండుకుంటారు. ఇదీ జిల్లా సహకార శాఖ పరిధిలోని కొన్ని సొసైటీల్లో జరుగుతున్న అవినీతి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలోని కొన్ని సొసైటీల్లో రూ.కోట్ల అవినీతి జరుగుతున్నా ఉన్నతాధికారులు సైతం దృష్టి సారించడం లేదు. దీనిని బట్టి అవినీతి ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా టి.నర్సాపురం సొసైటీలో రూ.15 కోట్లకుపైగా డిపాజిట్లను తిరిగి ఇవ్వాలని రైతులు ఆందోళన నిర్వహించి సొసైటీకి తాళం వేయించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 258 సహకార సంఘాలున్నాయి. వీటి పరిధిలో ఏటా సుమారు రూ.5 వేల కోట్ల మేర టర్నోవర్ జరుగుతుంది. ఐదారు గ్రామాలు కలిపి సొసైటీగా ఏర్పడి రైతులను సభ్యులుగా చేర్చుకుని సొసైటీ ద్వారా ఎరువులు, పురుగు మందులు విక్రయించడం, రైతుల నుంచి డిపాజిట్లు స్వీకరించడం, రైతులకు రుణాలు ఇస్తూ కార్యకలాపాలు నిర్వహిస్తుంటాయి. రూ.50 కోట్ల పైగా టర్నోవర్ జరిగే సొసైటీలు ఉమ్మడి జిల్లాలో అనేకం ఉన్నాయి. ఆదాయం పెరిగి వృద్ధిలోకి వస్తే సేవలు విస్తరించాలి. ఆదాయం పెరిగే ప్రతి సొసైటీలో అవినీతి పెరగడం స్థానిక ఉద్యోగులు మొదలుకొని జిల్లా స్థాయి అధికారుల వరకు పెంచి పోషిస్తూ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు.
రూ.100 కోట్లకుపైగా అవకతవకలు
జిల్లాలో గంగన్నగూడెం, విజయరాయి, జోగన్నపాలెం, చింతలపూడి, రాఘవాపురం, పోతునూరు, టీ. నర్సాపురం ఇలా సుమారు 25కుపైగా సొసైటీల్లో అవకతవకలు జరిగాయి. కొద్దిమందిపై విచారణ, సస్పెన్షన్లతో కోట్లాది రూపాయల అవినీతిని మరుగున పడేస్తున్నారు. కొన్నిచోట్ల వ్యవహారం బయటకు వచ్చినా ఇబ్బంది లేకుండా రికార్డులను తమదైన శైలిలో మార్చి మొక్కుబడి ఎంకై ్వరీ పేరుతో ఫైల్స్ మూసేస్తున్నారు. చింతలపూడి సొసైటీలో రూ.30 కోట్ల మేర అవినీతి జరిగింది. 8,928 మంది సభ్యులున్న సొసైటీలో ఏటా సగటున రూ.61.22 కోట్ల మేర టర్నోవర్ జరుగుతుంది. గతంలో ఈ సొసైటీలో రైతులకు తెలియకుండా రూ.కోట్ల రుణాలు సొసైటీ, శాఖలోని కీలక వ్యక్తులే తీసుకున్నారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో విచారణ నిర్వహించారు. నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోపు పూర్తి చేసి చర్యలు తీసుకోవాలి.
గురుకుల విద్య.. భద్రత మిథ్య
శిథిలావస్థకు చేరిన భవనాల్లోనే గురుకుల విద్య తరగతులు నిర్వహిస్తుండడంతో ఏ క్షణాన ఏ భవనం కూలిపోతుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 8లో u
అక్రమాలకు సహకరిస్తున్న విచారణాధికారులు
విచారణాధికారి అన్ని విధాలా సహకారం అందించి ఆరు నెలల్లో జరగాల్సిన విచారణను నిలుపుదల చేస్తూ.. సొసైటీ సభ్యులు కోర్టుకు వెళ్లి స్టే తీసుకువచ్చేలా సాయపడుతున్నారు. సీజ్ చేసిన సొసైటీ రికార్డులు విచారణాధికారి వద్ద ఉంటాయి. దాంట్లో ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62కు మార్చి కమిటీ తీర్మానం చేసినట్లు రికార్డు ట్యాపరింగ్ చేసి మరీ ప్రత్యేకంగా ఉత్తర్వులు తెచ్చారు. అనేక సొసైటీల్లో ఇదే తరహా వ్యవహారాలు జరిగాయి. గంగన్నగూడెంలో రూ.25 లక్షలు, జోగన్నపాలెంలో రూ.75 లక్షలు, చింతలపూడిలో రూ.30 లక్షలు, రాఘవాపురంలో రూ.40 లక్షలు, పోతునూరులో రూ.30 లక్షలకుపైగా జరిగిన అవినీతిలో కొద్ది మందిని సస్పెండ్ చేశారు. కీలక విచారణాధికారి మాత్రం విచారణ నిర్వహించి రిపోర్టును మాత్రం ప్రత్యేక వ్యవహారాలతో పెండింగ్‌లో ఉంచారని ఆరోపణలు ఉన్నాయి. సదరు విచారణాధికారికి ప్రత్యేకంగా నలుగురు అసిస్టెంట్ రిజిస్ట్రార్లు, ఒక సీనియర్ ఇన్‌స్పెక్టర్‌తో బృందం ఉంటుంది. సదరు బృందమే సొసైటీల్లోని తప్పులు తెలుసుకుని సొసైటీ కార్యదర్శులను పిలిచి మాట్లాడి రూ.లక్ష నుంచి రూ.5 లక్షలు, తీవ్రతను బట్టి రూ.20 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ప్రతి సొసైటీలో ఆడిట్ పూర్తి చేసి బేరం కుదిరితేనే సర్టిఫికెట్ ఇచ్చేలా వ్యవహారం సాగిస్తున్నారు. సొసైటీల్లో జరుగుతున్న అవినీతి వ్యవహారంపై ఇటీవల కొందరు ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేసి సహకార శాఖకు సంబంధం లేని వ్యక్తితో విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
న్యూస్‌రీల్
రైతుకు తెలియకుండానే రైతుల పేరుతో రుణాలు
పలు సహకార సొసైటీల్లో అవినీతి
విచారణాధికారులే కింగ్ మేకర్లుగా మారుతున్న వైనం
చింతలపూడి సొసైటీలో గతంలో రూ.30 కోట్ల మేర అవినీతి
డిపాజిట్లు ఇవ్వాలంటూ టి.నర్సాపురం సొసైటీ వద్ద రైతుల ఆందోళన
అవకతవకలు పరిశీలిస్తాం
సహకార సొసైటీలో జరిగిన అవినీతి, విచారణలు పూర్తిగా మా దృష్టికి రాలేదు. కొత్తగా ఇన్‌చార్జి బాధ్యతలు స్వీకరించాను. అన్నింటిని పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదించి చర్యలు తీసుకుంటామం.
– కే.వెంకటేశ్వరరావు,
జిల్లా సహకార శాఖ ఇన్‌చార్జి
టి.నర్సాపురం సొసైటీకి తాళం
టి.నర్సాపురం సొసైటీలో గతంలో భారీ కుంభకోణం వెలుగుచూసింది. కొన్నేళ్లుగా త్రిసభ్య కమిటీతో సొసైటీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. 370 మందికి సంబంధించి రూ.15 కోట్ల మేర మెచ్యూరిటీ పూర్తయినా డబ్బు ఖాతాల్లో జమ చేయలేదని ఆగ్రహించిన రైతులు డిపాజిట్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం సొసైటీ సిబ్బందితోనే తాళాలు వేయించి సొసైటీ వద్ద నిరసన వ్యక్తం చేశారు.

స్కాంలకు సహకారం