
సాధనచేస్తే..భారంకాదు
వేసవి శిక్షణా తరగతుల్లో భాగంగా ఏలూరు ఇండోర్ స్టేడియంలో జిల్లా క్రీడా ప్రాధికారి సంస్థ ఏర్పాటు చేసిన వెయిట్ లిఫ్టింగ్ వేసవి శిక్షణ శిబిరం ఉత్సాహంగా సాగుతోంది. 8 నుంచి 14 ఏళ్ల వయసులో బాలబాలికలు ప్రతిరోజు ఉదయం సాయంత్రం శిక్షణ పొందుతున్నారు. శిక్షణ శిబిరంలో పాల్గొన్న బాల బాలికలు సాధన కొనసాగిస్తే భవిష్యత్తులో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభాపాటవాలు చాటి పతకాలు సాధించగలరని కోచ్ రమేష్ చెప్పారు. ఉచితంగా నిర్వహిస్తున్న ఈ శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్ / ఏలూరు

సాధనచేస్తే..భారంకాదు

సాధనచేస్తే..భారంకాదు

సాధనచేస్తే..భారంకాదు