తణుకు టౌన్: ఉగాది సందర్భంగా తణుకు నన్నయ భట్టారక పీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పద్య కవితల పోటీల విజేతల వివరాలను పీఠం అధ్యక్ష, ప్రదాన కార్యదర్శులు జేఎస్ సుబ్రహ్మణ్యం, కొల్లి రామచంద్రశర్మ తెలిపారు. రాష్ట్రస్థాయిలో ఎం. ప్రకాశం పంతులు (గణపవరం), ధూళిపాళ ఆర్క సోమయాజీ, భాగవతుల లక్ష్మీనరసింహం (నరసాపురం) మొదటి మూడు స్థానాల్లో నిలిచారన్నారు. జిల్లాస్థాయిలో హైస్కూల్ విభాగంలో.. ఈ.సుజన ప్రకాశ్ (పెనుగొండ), ఆర్‌ఎస్‌ఎల్ మహేశ్వరి, ఎం.కార్తీక్ (తణుకు), 5,6,7 తరగతుల విభాగంలో.. ఆర్‌ఎస్ సర్వజ్ఞ, డి.దుర్గాభవాని (తణుకు), సవరం కీర్తిశ్రీ (చెరుకువాడ), వై.శివరంజని కె.ఉత్తిష్ట (తణుకు) విజేతలుగా నిలిచారన్నారు. వీరికి ఈనెల 22న రామకృష్ణ సేవా సమితి భవన్‌లో జరిగే కార్యక్రమంలో బహుమతులు అందిస్తామన్నారు.