దగా డీఎస్సీపై దండయాత్ర | - | Sakshi
Sakshi News home page

దగా డీఎస్సీపై దండయాత్ర

Jun 2 2026 12:20 AM | Updated on Jun 2 2026 12:20 AM

చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలపై వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం కదం తొక్కింది. వైఎస్సార్‌ సీపీ, యువజన విభాగం, ప్రజలు, అభ్యర్థులు సంయుక్తంగా నిరసన బాట పట్టారు. బూటకపు డీఎస్సీపై విచారణ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. డీఎస్సీ పేపర్‌ లీక్‌, స్పోర్ట్స్‌ కోటాలో పోస్టులు అమ్ముకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అక్రమ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

ప్ల కార్డుతో పార్టీ అమలాపురం

పార్లమెంటరీ పరిశీలకురాలు

జక్కంపూడి విజయలక్ష్మి

సాక్షి, రాజమహేంద్రవరం/రాజమహేంద్రవరం రూరల్‌, సీటీఆర్‌ఐ: చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, తక్షణం విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించాయి. వైఎస్సార్‌ సీపీ శ్రేణులు, యువజన నాయకులు, ప్రజలు, డీఎస్సీలో అన్యాయానికి గురైన బాధితులు బొమ్మూరులోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘ మీ సుపుత్రుడి శాఖలో డార్క్‌ ఆపరేషన్‌ను ఎందుకు దాచిపెడుతున్నారు? మెగా లీక్‌.. మెగా అవినీతి.. మెరిట్‌ లిస్టు మాయం..మెగా డీఎస్సీకాదు.. దగా డీఎస్సీ’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా అక్కడే కూర్చుని ధర్నా చేపట్టారు. ప్రభుత్వ అవినీతిపై నేతలు చేసిన నినాదాలకు కలెక్టరేట్‌ ప్రాంగణం దద్దరిల్లింది. అనంతరం మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలపై విచారణ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ జాయింట్‌ కలెక్టర్‌ మేఘ స్వరూప్‌కు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్రకార్యదర్శులు నక్కారాజబాబు, గిరజాల వీర్రాజు (బాబు), తోట రామకృష్ణ, నగరపాలక సంస్థ డివిజన్‌ల ఇన్‌చార్జి మింది నాగేంద్ర, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ఆరే చిన్ని, రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శులు దాట్ల పృథ్వీ, చాపరాజ, పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధికార ప్రతినిధి రుక్కియా సయ్యద్‌, రాష్ట్ర ఎస్సీసెల్‌ కార్యదర్శి విప్పర్తి ఫణి, రాష్ట్ర రైతు విభాగ సంయుక్త కార్యదర్శి వెలుగుబంటి అచ్యుతరామ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి తాడాల చక్రవర్తి, జిల్లా ఉపాధ్యక్షుడు బొప్పన సుబ్బారావు, జిల్లా అధికార ప్రతినిధి పెయ్యల రాజేష్‌, జిల్లా వక్ఫ్‌బోర్డు మాజీ చైర్మన్‌ మహ్మద్‌ ఆరీఫ్‌ పాల్గొన్నారు.

మెగా డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌ సీపీ,

యువజన విభాగం ఆధ్వర్యంలో పోరుబాట

బొమ్మూరు పార్టీ కార్యాలయం నుంచి

కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ

కలెక్టర్‌ కార్యాలయం ఎదుట బైఠాయింపు

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు, ధర్నా

జాయింట్‌ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత

మంత్రి లోకేష్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌

Advertisement
 
Advertisement
Advertisement