చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించింది మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీ. డీఎస్సీ నిర్వహణలో అనేక అవకతవకలు జరిగాయి. వాటిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలి. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇస్తామని దారుణంగా మోసం చేశారు. స్పోర్ట్స్ కోటా పోస్టులను అమ్ముకున్నారు. డీఎస్సీ నియామాకాలపై ఆరోపణలు వచ్చినప్పుడు నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అది మానేసి ప్రశ్నిస్తున్న వారిపై ఎదురుదాడి చేస్తున్నారు. డీఎస్సీ పరీక్షలు రాసిన యువతతో ఆటాలాడుకుంటున్నారు. యువతకు న్యాయం జరిగే వరకూ వైఎస్సార్ సీపీ పోరాటం ఆగదు.
–చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి
అనుమానాలు
నివృత్తి చేయాలి
డీఎస్సీ నిర్వహణపై నిరుద్యోగ యువతలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెగా డీఎస్సీ లక్షలాది కుటుంబాలను ప్రభావితం చేసే అంశం. మెరిట్ లిస్ట్ ప్రకటించకపోవడం, కేవలం ఎంపికై న అభ్యర్థులకే ఎస్‌ఎంఎస్‌లు పంపించడం అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. పక్కాగా పరీక్షలు నిర్వహించినప్పుడు జాబితా, మెరిట్ లిస్టు, మార్కుల వివరాలు బహిర్గతం చేయాలి. డీఎస్సీ జిల్లా స్థాయి టాపర్, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంక్ వచ్చిన అభ్యర్థి పేరు జాబితాలో మాయం కావడం అనుమానాస్పదం.
– డాక్టర్ గూడూరి శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ
రాజమండ్రి పార్లమెంట్ కో ఆర్డినేటర్
చంద్రబాబు ప్రభుత్వానికి
బుద్ధి చెబుదాం
బందిపోటు కంటే హీనమైన వ్యక్తి చంద్రబాబు. ఉద్యోగాలు ఇస్తానంటూ డీఎస్సీ అభ్యర్థులను ఊరించి అన్యాయం చేశారు. చంద్రబాబును క్షమించాల్సిన అవసరం లేదు. డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఉద్యమించి తీరుతాం. ఇలాంటి అక్రమాలను, అన్యాయాలను ఏమాత్రం సహించబోం. యువత, నిరుద్యోగులు, ప్రజలు సంఘటితంగా ఉద్యమించి చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
–జక్కంపూడి విజయలక్ష్మి,
వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకురాలు


