జేఈఈ అడ్వాన్స్‌డ్‌–2026 ఫలితాలలో తిరుమల విద్యార్థుల ప్రభంజనం | - | Sakshi
Sakshi News home page

జేఈఈ అడ్వాన్స్‌డ్‌–2026 ఫలితాలలో తిరుమల విద్యార్థుల ప్రభంజనం

Jun 2 2026 12:20 AM | Updated on Jun 2 2026 12:20 AM

రాజమహేంద్రవరం రూరల్‌: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రతిష్టాత్మక జేఇఇ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో తమ తిరుమల ఐఐటీ అండ్‌ మెడికల్‌ అకాడమీ విద్యార్థులు అత్యద్భుత ఫలితాలు సాధించినట్లు తిరుమల విద్యాసంస్థల చైర్మన్‌ నున్న తిరుమలరావు తెలిపారు. వివిధ కేటగిరీలలో జాతీయస్థాయిలో తమ విద్యార్థులు దేవశ్రీవేద్‌ 3వ ర్యాంకు, ఆకేటి సాయిసత్యరిత్విక్‌ 18వ ర్యాంకు, యవ్వాకుల సత్యసాత్విక్‌నాయుడు 29వ ర్యాంకు, గొల్లా ప్రభవ్‌తేజ 41వ ర్యాంకు, మోకా రోహన్‌ సందేష్‌ 90వ ర్యాంకు సాధించారన్నారు. ఇంకా 151, 159, 165, 172, 221, 230, 237, 256, 269, 275, 287, 297 ర్యాంకులు సాధించారన్నారు. 1000లోపు 79మంది ,3000లోపు 207మంది, 5000లోపు 318మంది, 10,000లోపు 456మంది ర్యాంకులు సాధించారన్నారు. సుమారు 320మంది విద్యార్థులు ఐఐటీలో సీట్లు సాధించగలరని ఆయన తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను చైర్మన్‌ నున్న తిరుమలరావు, అకడమిక్‌ డైరెక్టర్‌ జి.సతీష్‌బాబు, ప్రిన్సిపాల్‌ వి.శ్రీహరి అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement