జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో శ్రీప్రకాష్‌ విద్యార్థి ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో శ్రీప్రకాష్‌ విద్యార్థి ప్రతిభ

Jun 2 2026 12:20 AM | Updated on Jun 2 2026 12:20 AM

తుని: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో శ్రీ ప్రకాష్‌ జూనియర్‌ కళాశాల విద్యార్థి జె.మోనిష్‌ కుమార్‌ ఓబీసీ కేటగిరిలో 167 ర్యాంకు, జనరల్‌ కేటగిరిలో 974 ర్యాంకు సాధించాడని ప్రిన్సిపాల్‌ వివిఎస్‌ఎస్‌.భానుమూర్తి సోమవారం తెలిపారు. శ్రీప్రకాష్‌లో స్కూల్‌ లెవెల్‌ నుంచి ఇస్తున్న పొసైటీ ఫర్‌ ప్రమోటింగ్‌ ఎకడమిక్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ స్కూల్‌ (స్పేసెస్‌), శ్రీప్రకాష్‌ అచీవర్స్‌ అకాడమీ(స్పా) ఇంటిగ్రేటేడ్‌ ప్రోగ్రాం ద్వారా తమ విద్యార్థులు విజయాలు సాధిస్తున్నారన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థిని విద్యాసంస్థల అధినేత సీహెచ్‌వీకె. నరసింహరావు, సంయుక్త కార్యదర్శి విజయ్‌ప్రకాష్‌, ఉపాధ్యాయులు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement