రాజమహేంద్రవరం రూరల్: డీఎస్సీ–2025లో అవకతవకలు, మోసాలపై సోమవారం వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో బొమ్మూరులోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు బొమ్మూరు వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా కలెక్టరేట్‌కు వెళ్లనున్నట్టు తెలిపారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయనున్నట్టు తెలిపారు. కార్యక్రమానికి అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్లు, పార్టీ యువజన విభాగ నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువత, డీఎస్సీ బాధితులు అధిక సంఖ్యలో హాజరుకావాలన్నారు.


