రగ్బీ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రగ్బీ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక

Jun 1 2026 12:08 AM | Updated on Jun 1 2026 12:08 AM

పిఠాపురం: స్థానిక ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో ఆదివారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రగ్బీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బాల బాలికల రగ్బీ జట్టును ఎంపిక చేశారు. దీనికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి 49 మంది హాజరుకాగా, 12 మంది బాలికలు, 12 మంది బాలురను ఎంపికయ్యారు. వీరందరూ జూన్‌ 6, 7 తేదీల్లో పల్నాడు జిల్లా నందిగామలో జరిగే రాష్ట్ర స్థాయి జూనియర్స్‌ రగ్బీ బాల బాలికల పోటీల్లో పాల్గొంటారని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రగ్బీ చైర్మన్‌ వియ్యపు రమణరాజు, సెక్రటరీ పి.కృష్ణ, కోచ్‌ పి.లక్ష్మణరావు తెలిపారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా పవన్‌, బి.వంశీ, జి.శివప్రసాద్‌, సురేష్‌ వ్యవహరించారు.

Advertisement
 
Advertisement
Advertisement