లారీ ఢీకొని మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని మహిళ మృతి

May 31 2026 12:18 AM | Updated on May 31 2026 12:18 AM

మరొకరికి తీవ్ర గాయాలు

శృంగవరంలో ఘటన

రౌతులపూడి: మండలంలోని రౌతులపూడి – కత్తిపూడి ఆర్‌అండ్‌బీ రహదారిలో శృంగవరం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. శృంగవరానికి చెందిన యలమంచిలి అమ్మాజీ, యలమంచిలి చక్రవేణి గుడికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కడానికి గ్రామంలోని అంబేడ్కర్‌ విగ్రహం సమీపంలో రోడ్డుపైకి వెళ్లారు. అదే సమయంలో కత్తిపూడి వైపు నల్ల కంకరరాయి లోడుతో వెళుతున్న లారీ రోడ్డుపై ఉన్న వీరిని ఢీకొంది. తీవ్ర గాయాలైన ఇద్దరినీ అంబులెన్స్‌లో కాకినాడ తరలిస్తుండగా మార్గం మధ్యలో అమ్మాజీ (52) మృతి చెందింది. చక్రవేణి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సమాచారం తెలిసిన వెంటనే ఎస్సై వెంకటేశ్వరరావు వెళ్లి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement