కొత్తపల్లి: మోటారు సైకిల్‌పై వస్తూ ప్రమాదవశాత్తూ చెరువులో పడి యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పిఠాపురం – పాత ఇసుకపల్లి రహదారిలో శనివారం ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పిఠాపురానికి చెందిన ముగ్గురు యువకులు మైటారు సైకిల్‌పై అన్నవరం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కోనపాపపేట, మూలపేట, పాత ఇసుకపల్లి మీదుగా పిఠాపురం వస్తుండగా ప్రమాదవశాత్తు పాత ఇసుకపల్లి శివారు ఉన్న చెరువులో పడ్డారు. ఈ ప్రమాదంలో సాఖా సాయిరాం (16) మృతి చెందగా, గాయపడిన ఇద్దరు యువకులను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎస్సై వెంకటేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


