అతి వేగంతో అదుపు తప్పిన కారు | - | Sakshi
Sakshi News home page

అతి వేగంతో అదుపు తప్పిన కారు

May 31 2026 12:18 AM | Updated on May 31 2026 12:18 AM

కంటైనర్‌ను ఢీకొన్న వైనం

ముగ్గురికి తీవ్ర గాయాలు

దేవరపల్లి: అతి వేగంతో వెళుతున్న కారు అదుపు తప్పి, డివైడర్‌ను దాటి ఓ కంటైనర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గు రికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. గుండుగొలను – కొవ్వూరు 16వ నంబర్‌ జాతీయ రహదారిపై యర్నగూడెం వద్ద శనివారం అతి వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను దాటి రాజమహేంద్రవరం వైపు వెళుతున్న కంటైనర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. కోనసీమ జిల్లా వాడపల్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ఏలూరు వైపు వెళుతున్న కారు అదుపు తప్పింది. ఆ సమయంలో కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. కాగా.. కారు ఢీకొనడంతో కంటైనర్‌ అదుపు తప్పి ఫ్లై ఓవర్‌ వంతెన గోడను ఢీకొని ఆగింది. దీంతో మిగిలిన వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కాగా.. క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉందని ఎస్సై పి.మనోహర్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement