తుని రూరల్: ఎస్.అన్నవరం శివారు శేషాద్రి నగర్ కాలనీలో ఇటీవల తరచూ దొంగతనాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఉప్పలపాటి సూర్యనారాయణరాజు, పంపనబోయిన రాజబాబు (చంటి) ఆధ్వర్యంలో 15 మంది యువకులు బృందాలుగా ఏర్పడి రాత్రి వేళల్లో కర్రలతో వీధుల్లో తిరుగుతూ కాపలా కాస్తున్నారు. 15 రోజుల నుంచి ఇదే విధంగా కాపలా ఉంటున్నట్టు కనకాల వీరభద్రరావు, తేనే లోవరాజు, నడిమింటి ఎల్లంనాయుడు, దుంగ దారబాబు, పోలిశెట్టి చందు తదితరులు తెలిపారు. కొందరు దైవదర్శనాలకు, శుభకార్యాలకు రెండు, మూడు రోజులు ఇంటికి తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళుతున్నారని, తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి దొంగలు చోరీలకు పాల్పడుతున్నారన్నారు.


